YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

కనుమరుగవుతున్న సహకార సంస్థలు

కనుమరుగవుతున్న సహకార సంస్థలు

గుంటూరు, మార్చి 30,
గ్రామ స్థాయిలో రైతులకు ఆర్థిక తోడ్పాటు లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పిఎసిఎస్‌-పాక్స్‌)ను పూర్తిగా వ్యాపార దృక్ప ధానికి మళ్లించేందుకు వేగంగా కార్యక్రమాలు రూపుదిద్దు కుంటున్నాయి. పాక్స్‌లో ప్రొఫెషనల్‌ కన్సల్టెన్సీలకు పదవులు, పెట్రోల్‌ బంక్‌లు, సూపర్‌ మార్కెట్లు, విస్తృతస్థాయి డిజిటలైజేషన్‌, రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)తో అనుసంధానం, బహుళ సౌకర్య కేంద్రాలుగా మార్పు, వ్యవసాయ పరికరాల ఔట్‌లెట్లు నెలకొల్పే ప్రతిపాదనలు తెరమీదికొచ్చాయి. సహకార రంగ పునరుజ్జీవం, బలోపేతం అనే ముద్దు పేర్లతో ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల అసలు టార్గెట్‌ పాక్స్‌్‌ కమర్షియలైజేషన్‌. ఇప్పటి వరకు సహకార రంగంలోకి నేరుగా కార్పొరేట్లు, ప్రైవేటు సంస్థలు ప్రవేశించడానికి వీల్లేకుండా కఠిన చట్టాలున్నాయి. సంఘ సభ్యుల అభీష్టం మేరకే కార్యక్రమాలన్నీ సాగేవి. ఒక మేరకు రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ, సహకారం ఉండేది. సహకార రంగ ఆస్తులు, అవి నిర్వహించే సేవల్లో కార్పొరేట్ల చొరబాటుకు అనుకూ లంగా పథకాలొస్తున్నాయి. కేంద్రం తమ వద్ద ప్రత్యేకంగా సహకార మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశాక కార్పొరేట్లకు గేట్లు బార్లా తీసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇరుసుగా ఉపయోగపడుతోంది.
కేంద్రం కొత్తగా నెలకొల్పిన సహకార మంత్రిత్వశాఖ దేశ వ్యాప్తంగా రెండు దశల్లో 68 వేల పాక్స్‌ డిజిటలైజేషన్‌ ద్వారా వాటి ఆర్థిక లావాదేవీలను తన కంట్రోల్‌కి తీసుకొస్తోంది. మన రాష్ట్ర సర్కారు మరో అడుగు ముందుకేసి ఒకే దశలో మొత్తం 2,049 సంఘాల డిజిటలైజేషన్‌ అంటోంది. ఒక్కో పాక్స్‌్‌కు రూ.4.37 లక్షల వ్యయాన్ని అంచనా వేశారు. మొత్తం ఖర్చు రూ.89.54 కోట్లు కాగా అందులో 60 శాతం కేంద్రం (53.72 కోట్లు), 40 శాతం రాష్ట్రం (35.82 కోట్లు) పెట్టుకుంటున్నాయి.కోవిడ్‌ వేళ కేంద్రం ప్రకటించిన 'ఆత్మనిర్భర్‌ భారత్‌' ప్యాకేజీలో వ్యవసాయ మౌలిక వసతుల నిధి (అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌) ఒకటి. నాబార్డు అప్పు ఇస్తుంది. రాష్ట్రం దాన్ని ఆర్‌బికెలకు మళ్లిస్తోంది. ఆర్‌బికెలలో గోదాములు, పాల శీతల, సేకరణ కేంద్రాలు, వ్యవసాయ యంత్రాలను అద్దెకిచ్చే కష్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల వంటి అన్ని సదుపాయాలూ ఒకే చోట లభించే బహుళ వసతుల కేంద్రాల ఏర్పాటుకు వినియోగిస్తోంది. ప్రస్తుతం ఆర్‌బికెలకు స్థలాలు లేనందున పాక్స్‌ స్థలాలను అందుకు ఉపయోగపెడుతోంది. నాబార్డు రుణంతో కలిపి ప్రాజెక్టు వ్యయం రూ.1,616 కోట్లు. చిత్తూరు, కర్నూలు, తూర్పుగోదావరిలకు ఐదేళ్ల కాలానికి మంజూరైన ఐసిడిపి నిధులను సైతం పాక్స్‌ వ్యాపారాభి వృద్ధికి ఖర్చు చేస్తున్నారు. వాణిజ్యానికి అనుకూలంగా ఉండే పాక్స్‌ స్థలాల్లో ఐఒసి, హిందూస్తాన్‌ పెట్రోలియం వంటి సంస్థల పెట్రోల్‌, డీజిల్‌ బంక్‌లకు అనుమతిస్తారు.ఆర్‌బికెలలో పరపతి, పరపతేతర సేవల విస్తరణకు, వాటిని పాక్స్‌్‌, డిసిసిబిలతో అనుసంధానం చేయడంపై అధ్యయనానికి ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమించింది. ఆర్‌బికెలకు, పాక్స్‌ మధ్య సంబంధం నెలకొల్పడానికి అవసరమైన విధానాన్ని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ రూపొందిస్తుంది. ఇప్పటికే సహకార రంగంలో చేపట్టాల్సిన మార్పులపై నాబ్‌కాన్స్‌ అనే ప్రైవేటు కన్సల్టెన్సీ ఇచ్చిన నివేదిక అమలు ప్రారంభమైంది. పాక్స్‌లో 'ఇతరుల' నియామకం అందులో భాగం.

Related Posts