విశాఖపట్నం
విశాఖ పోర్ట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా యి.జీవనోపాధి కల్పించాలని కోరుతూ మత్సకారులు ధర్నాకు దిగారు.2002 వరకు ఉంటున్న స్థలం నుంచి మత్స్య కారులను తరలించిన పోర్ట్ అధికారు లు జీవనోపాధి కల్పించడంలో అన్యా యం చేశారని ఆందోళన వ్యక్తం చేశా రు.మత్స్యకార సంఘం నాయకులు భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు వచ్చి వారిని నిలువరించే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో పోలీసులకు మత్స్యకార సంఘం నాయకులకు వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు పోర్ట్ అధికారులు జీవనోపాధి కల్పిం చాలని డిమాండ్ చేశారు.