గుంటూరు
ఫిరంగిపురంలోని సొలస బస్టాండ్ వద్ద ఉన్న ఎస్ బి ఐ బ్యాంకులో మంగళవారం అర్ధరాత్రి బ్యాంకు కిటికీ ఇనుప చువ్వలు కట్ చేసి బ్యాంకులో చోరీకి ప్రయత్నం జరిగింది. నరసరావుపేట సీఐ భక్తవత్సల రెడ్డి, ఫిరంగిపురం ఎస్. బి. ఐ బ్యాంక్ మేనేజర్ సుస్మిత తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బ్యాంకు లో అలారం మోగింది. . ఆ మెసేజ్ బ్యాంకు మేనేజర్ కు ,సిబ్బంది కి రాగా వెంటనే స్థానికంగా ఉన్న బ్యాంక్ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్లో తెలపగా పోలీసులు వచ్చారు. పోలీసు వచ్చే సమయానికి దొంగలు పరారయ్యారు. బుధవారం ఉదయం నరసరావుపేట డిఎప్సీ, సిహెచ్. విజయ భాస్కర్ , నరసరావుపేట రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి బ్యాంకు ను పరిశీలించారు. బ్యాంకులో ఎటువంటి నగదు దొంగలించ లేదని , చోరీకి ప్రయత్నం జరిగిందని అన్నారు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో వేలిముద్రలు, సీసీ టీవీ ఫుటేజ్ తీసుకున్నారు.