న్యూఢిల్లీ
ప్రభుత్వాలేమో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాడాలని చెబుతున్నాయి. కానీ, కారణాలేమైనా చాలాచోట్ల అవి కాలి బూడిదవుతున్నాయి. అంతేనా ప్రాణాలు తీస్తున్నాయి. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కాలుష్యం తగ్గించడానికి, పెట్రోల్, డీజిల్ యూసేజ్ పెరగకుండా, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతోంది కేంద్ర ప్రభుత్వం . వీటి తయారీదారులకు, వినియోగదారులకు రాయితీలు కూడా ఇస్తూ ప్రోత్సహిస్తోంది. కానీ, ఇటీవల మహారాష్ట్ర, తమిళనాడులో జరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల అగ్నిప్రమాదం కలవరపెడుతోంది. దీంతో దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఓలా, ఒకినావా ఎలక్ట్రిక్ బైక్ లకు మంటలు అంటుకున్న రెండు సంఘటనలపై దర్యాప్తు చేయడానికి, స్వతంత్ర నిపుణుల బృందాన్ని నియమించాలని కేంద్రం నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితం పూణే నగరంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1ప్రో బైకు అగ్నికి ఆహుతి అయింది. స్కూటరు నుంచి ఉన్నట్టుండి పొగలు రావడంతో, క్షణాల్లోనే కాలి బూడిదైంది.