YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముమ్మరంగా సహాయక చర్యలు

ముమ్మరంగా సహాయక చర్యలు

తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాద ఘటన వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 40 అడుగుల లోతులో గుర్తించిన పడవను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది భారీ క్రేన్ల సహాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సహాయక చర్యల్లో ఉభయ గోదావరి జిల్లాల నుంచి 300 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు. అవసరమైతే మరిన్ని క్రేన్ల సహాయంతో వెంటనే లాంచీని బయటకు తీయాలని, మృతదేహాలను పోస్టమార్టం కోసం ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మృతదేహాలు దొరికితే పోస్టు మార్టెం  చేసేందుకు పోలవరంలో ఏర్పాట్లు చేశారు. హోంమంత్రి చినరాజప్ప  లాంచీ ప్రమాదస్థలి ని పరిశీలించారు. ప్రమాదస్థలిని పరిశీలించిన హోంమంత్రి సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఘటనలో గల్లంతైన వారిలో బాలుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. నీటిపై బాలుడి మృతదేహాం తేలుతూ కనిపించింది. దీంతో రెస్క్యూ టీం బాలుడి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. గోదావరి నదిలో గల్లంతైన మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. భారీ క్రేన్ల సహాయంతో సిబ్బంది 40 అడుగుల లోతులో ఉన్న పడవను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. రెండు హెలికాఫ్టర్ల ద్వారా గోదావరి నదిలో మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మరోవైపు అందులో ఉన్నవారి ఆచూకీ ఏమైనా దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో చిన్న చిన్న బోట్లతో గోదావరిలో ముమ్మర గాలింపు జరుపుతున్నారు.  తమ వారి ఆచూకీ కోసం గ్రామాల్లో ప్రజలు భారీగా ఘటన స్థలానికి తరలివస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని వారంతా విషాదంలో మునిగిపోయారు. 

Related Posts