YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఖమ్మం గులాబీలో డిష్యూం,,,

ఖమ్మం గులాబీలో డిష్యూం,,,

ఖమ్మం, మార్చి 31,
పినపాక గులాబీ తోటలో వరసగా ఢిష్యూం ఢిష్యూమ్‌లే. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీ ఎంపీల మధ్య తలెత్తిన విభేదాలు రకరకాలుగా మలుపులు తీసుకుంటోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అధికారపార్టీ నేతల మధ్య ఏ విషయంలో అగ్గి రాజుకుంది?భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక. కొద్దిరోజులుగా ఇక్కడ టీఆర్‌ఎస్‌ రాజకీయాలు వాడీవేడీగా ఉంటున్నాయి. ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య ఉప్పు నిప్పులా మారిపోయింది పరిస్థితి. అధిపత్య రాజకీయాలు సెగలు రేపుతున్నాయి. పోటాపోటీ కార్యక్రమాలతో అట్టుడుకుతోంది పినపాక. పోలీస్‌ కేసులు.. రాళ్ల దాడులు.. దూషణలకు ఏ వర్గమూ భయపడటం లేదు. తగ్గేదే లేదన్నట్టుగా ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు నాయకులు.పినపాక ఎస్టీ రిజర్డ్వ్‌ నియోజకవర్గం. ఇక్కడ నుంచి రేగా కాంతారావు రెండుసార్లు కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత రేగా కారెక్కేయడం.. విప్‌ కావడం.. టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా నియామకం చకచకా జరిగిపోయాయి. అధికారపార్టీకి జిల్లా అధ్యక్షుడయ్యాక స్పీడ్‌ పెంచేశారు రేగా. ఇదే సమయంలో పినపాకలో మాజీ ఎంపీ పొంగులేటి తన వర్గానికి బాసటగా పాలిటిక్స్‌ చేయడంతో గొడవలు హై టెంపరేచర్‌కు దారితీస్తున్నాయి. ఇద్దరూ టీఆర్ఎస్‌ నాయకులే అయినప్పటికీ ఒకరినొకరు ఇరుకున పెట్టుకునేలా పావులు కదపడం ఆసక్తిగా మారుతోంది.పొంగులేటి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు పినపాకతో ఎలాంటి సంబంధం లేదు. ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలో పినపాక లేదు. కానీ.. ఈ సెగ్మెంట్‌లో మాజీ ఎంపీకి అనుచరవర్గం మాత్రం ఉంది. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన పాయం వెంకటేశ్వర్లు.. మాజీ ఎంపీకి ముఖ్య అనుచరుడు. 2018 ఎన్నికల్లో ఓడినప్పటికీ పొంగులేటిని వీడలేదు పాయం. వచ్చే ఎన్నికల్లో మాజీ ఎంపీ సహకారంతో పోటీ చేయాలని చూస్తున్నారట పాయం. అదే ఎమ్మెల్యే రేగా కాంతారావుకు చిర్రెత్తికొస్తున్నట్టు చెబుతున్నారు.పినపాకను తన అడ్డాగా చేసుకోవాలని రేగా కాంతారావు చూస్తున్నారు. టీఆర్ఎస్‌ నాయకులే అయినా.. తనకు పోటీగా మారతారంటే అస్సలు ఉపేక్షించడం లేదు. మాజీ ఎమ్మెల్యే పాయం.. మాజీ ఎంపీ పొంగులేటికి పినపాకలో చోటుకల్పిస్తే తన సీటుకే ఎసరు తెస్తారనే ఆందోళనలో ఉన్నారట ఎమ్మెల్యే రేగా. అందుకే స్వపక్షీయులైనా తన పవరేంటో చూపిస్తున్నారు. ఆ మధ్య అశ్వాపురం మండలం మల్లెలమడుగులో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణకు పొంగులేటి అనుచరులు ప్రయత్నిస్తే ఎమ్మెల్యే అడ్డుకున్నారు. అది రచ్చ రచ్చ అయ్యింది. ఇటీవలే రేగా సొంత మండలం కరకగూడెంలో పర్యటించారు మాజీ ఎంపీ. దాదాపు 17 గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రైవేట్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు పొంగులేటి.పొంగులేటి కార్యక్రమాలకు పార్టీ కేడర్‌ ఎవరూ వెళ్లొద్దని ఎమ్మెల్యే రేగా ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా కనిపించాయట. అయితే అధిష్ఠానం అండతోనే రేగా ఈ ఆదేశాలు ఇచ్చారా లేక సొంతంగా అనేది చర్చగా మారింది. ఎవరు ఎలాంటి ఆదేశాలిచ్చినా.. మీ పని మీరు చేసుకుపోవాలని.. కేడర్‌కు అండగా ఉంటానని భరోసా ఇచ్చారట మాజీ ఎంపీ. దీంతో పాయం వెంకటేశ్వర్లుకు మద్దతుగా పొంగులేటి గ్రౌండ్‌లోకి దిగినట్టు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. దీంతో పినపాక టీఆర్ఎస్‌లో ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్‌ పార్టీ వర్గాల్లో ఉందట.

Related Posts