ఒంగోలు
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపములోని నల్లమల అటవీ ప్రాంతంలో పాత రైల్వే బ్రిడ్జ్ మలుపువద్ద తెల్లవారు జామున 2 గం సమయంలో ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 8 గంటలుగా అటు ఇటు వాహనాలు నిలిచిపోఆయి. లారిలోని సరుకు అన్లోడ్ చేసి వాహనాన్ని పక్కకు తీయాడానికి మరోరెండు గంటలు పట్టింది. ఘటన తో నంద్యాల నుండి గిద్దలూరు వచ్చు వాహనాలు,గిద్దలూరు నుండి నంద్యాల వైపు వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడం జరిగింది.అటువాహన దారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.