మదనపల్లె
చిత్తూరు జిల్లాలో మొదటి సారిగా పంచాంగాన్ని రాసి, దాన్ని బ్రాహ్మణులకు వితరణగా ఇస్తున్న శివకుమార్ శర్మ అభినందనీయుడని మదనపల్లె ఆర్డీవో మురళి పేర్కొన్నారు. నేడు ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో అత్తూలి శివకుమార్ శర్మ గుణించబడిన పంచాంగమును ఆర్డీవో మురళి చేతుల మీదుగా బ్రాహ్మణ సంఘ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో APBSSS సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను మరచి పోరాదన్నారు. మన చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుమల పంచాంగం ఉందని, దానిని వేరే జిల్లాకు చెందిన వారు రాయడం జరిగిందన్నారు. చిత్తూరు జిల్లాలో మొదటి సారిగా పంచాంగాన్ని రాసిన వ్యక్తిగా శివకుమార్ శర్మ నిలవడం అభినందనీయమని, ఈయన మరిన్ని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.