పుంగనూరు
భక్తుల పాలిట కల్పవల్లిగా ఖ్యాతి గడించిన పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర ప్రారంభమైంది. జిల్లాలోనే పెద్ద జాతరగా పెరు గాంచిన ఈ జాతరకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈ జాతర ఉగాది ముందు వచ్చే మొదటి మంగళవారం నాడు పుంగనూరు పరిసర ప్రాంతాల్లోని వంద గ్రామాల ప్రజలు నిర్వహిస్తారు. పట్టణంలోని ఎనిమిది ప్రాంతాల్లోని శక్తి ఆలయాల్లో స్థిరపడిన గంగమ్మ సోదరి మణులైన అష్ట గంగమ్మ లకు భక్తులు మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ.