హైదరాబాద్
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల పై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఎల్బినగర్ ఇన్చార్జి మల్ రెడ్డి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో టీకేఆర్ కమాన్ వద్ద సిలిండర్లు తో మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి నిరసన వ్యక్తం చేసారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కెసిఆర్ పేద ప్రజల నడ్డి నడుస్తూ గ్యాస్,పెట్రోల్, డీజిల్,నిత్యావసర ధరలు పెంచుకుంటూ పోతున్నారా అని మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ నుండి కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే పరిస్థితి తీసుకు వచ్చారని అన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు తప్ప చేతలు లేవని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వరి కొనుగోలు విషయంలో గొడవ పడుతూ రైతులను నట్టేట ముంచుతున్నారు అని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు తొలిగిస్తూ,ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకుండా రాష్ట్రాన్ని అప్పుల పలు చేశారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి, హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.