YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

అమరావతి
కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్లకు  ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది.  ఐఏస్లు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, బుడితి రాజశేఖర్, వాడ్రేవు చిన వీరభద్రుడు, జె.శ్యామలరావు,  శ్రీలక్ష్మి, ఎంఎం నాయక్, విజయ్కుమార్లకు రెండు వారాల జైలుశిక్ష, జరిమానా విధించింది. ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయొద్దంటూ గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. వాటిని ఐఏఎస్ అధికారులు పాటించలేదని కోర్టు మండిపడింది. అయితే, సదరు అధికారులు  కోర్టును క్షమాపణ కోరారు. పొరపాటు అయ్యిందని, భవిష్యత్తులో ఇలాంటివి పునావృతం కాకుండా చూస్తామని తెలిపారు. దాంతో, జైలుశిక్షకు బదులుగా ఏడాదిపాటు ప్రతినెలలో ఒకరోజు సంక్షేమ హాస్టల్కు వెళ్లి సేవ చేయాలి. ఏడాదిపాటు సంక్షేమ హాస్టల్లో ఒక్కపూట భోజనం పెట్టాలి హైకోర్టు ఆదేశించింది.  

Related Posts