నంద్యాల
నంద్యాల ఆవాజ్ కమిటీ పట్టణ అధ్యక్షులు యస్ ఎ బాబుల్లా ఆధ్వర్యంలో నంద్యాలలోని విద్యుత్ కార్యాలయంలో డీ ఈ రమణా రెడ్డి కి ఆవాజ్ కమిటీ నాయకులు విద్యుత్ బిల్లులు పెంపు ఉపసంహరణపై వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ యూత్ కార్యదర్శి సద్దాం హుసేన్, సహ కార్యదర్శి ఇలియాస్, సభ్యులు రిజ్వాన్, కమల్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఆవాజ్ అధ్యక్షుడు యస్ ఏ బాబుల్లా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విద్యుత్ బిల్లుల పెంపుపై నీతి వాక్యాలు చెప్పి అధికారంలోకి వచ్చినప్పటి నుండి తరచు విద్యుత్ బిల్లులు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ప్రమాణ స్వీకారం నాడు పెంచిన విద్యుత్ బిల్లులు తగ్గిస్తామని చెప్పి మోసపూరిత మాటలతో ప్రజలను నమ్మించి ఈనాడు సామాన్యుడు బ్రతకలేని విధంగా వివిధ పన్నులు వసూలు చేస్తూ ప్రజలను వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. విద్యుత్ బిల్లుల పెంపును వెంటనే ఉపసంహరించుకోకపోతే ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాలలో ఉద్యమాలు చేస్తామని తెలిపారు.