కడప
ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశం రణరంగంగా మారింది. తమ వార్డుల్లో పనులు జరగడం లేదని అధికార వైసీపీకి చెందిన కౌన్సిలర్లు పాలకవర్గాన్ని నిలదీస్తుండగా మరో వర్గానికి చెందిన కౌన్సిలర్లు అభ్యంతరం చెప్పడంతో వాగ్వాదం ప్రారంభమయ్యింది. ఒకరిపై ఒకరు బూతులతో తిట్టుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారి చెప్పులతో కొట్టుకున్నారు. పోలీసులు ఇరువర్గాలకు చెందిన వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ముష్టిఘాతాలకు పాల్పడ్డారు. తన వార్డులో పనులు జరగడం లేదని 13 వ కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా సమస్యను లేవనెత్తగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజా మోహీద్దీన్ సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. దీంతో రెచ్చిపోయిన సభ్యులు రెండుగా వీడి చెప్పులతో కొట్టుకున్నారు. సమావేశం హాల్లో నే కాకుండా బయటకొచ్చి గొడవ పడ్డారు.