YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ అసమర్థ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపే నిదర్శనం

జగన్ అసమర్థ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపే నిదర్శనం

అమరావతి
 స్విచ్ వేయకుండానే జగన్ ప్రజలకు విద్యుత్ షాక్లిస్తున్నారని.. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. పాదయాత్రలో విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తానని ఊరూరా చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక పెంచుకుంటూ పోతూ ప్రజలను నయవంచన చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత సీఎం జగన్ దేనని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. జగన్ అసమర్థ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపు నిదర్శనమని తెలిపారు. స్విచ్ వేయకుండానే జగన్ రెడ్డి ప్రజలను విద్యుత్ షాక్లకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి ఇప్పటికీ ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ. 11,600 కోట్ల భారం మోపారన్నారు. ప్రస్తుత ఛార్జీల పెంపుతో ప్రజలపై ఏడాదికి మరో రూ. 4,400 కోట్ల భారం పడనుందని తెలిపారు. జగన్ రెడ్డి తన చేతగానితనంతో ఒకవైపు విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ.. మరోవైపు ప్రజలపై పెనుభారం మోపుతున్నారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. పాలన చేతగాకపోతే దిగిపోవాలేగానీ... పన్నులు, ఛార్జీలు పెంచుతూ ప్రజలను దోచుకోవద్దని హితవు పలికారు. ఛార్జీలు తగ్గించే వరకు జగన్ను విడిచిపెట్టే సమస్యే లేదు..: పాదయాత్రలో విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తానని ఊరూరా చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక పెంచుకుంటూ పోతూ ప్రజలను నయవంచన చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. జగన్ రెడ్డి పలాన దానిపై పన్నులు పెంచలేదని చెప్పగలరా అని ప్రశ్నించారు. చెత్తపన్ను దగ్గర నుంచి... నిత్యావసర వస్తువులు, విద్యుత్ ఛార్జీలు వరకు ప్రతీది పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. పల్లె, పల్లెకు జగన్ రెడ్డి దుర్మార్గాన్ని ప్రజలకు వివరించి.. ఛార్జీలు తగ్గించే వరకు జగన్ రెడ్డిని విడిచిపెట్టే సమస్యే లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.  విజనరీకి.. ప్రిజనరీకి తేడా నేటి విద్యుత్ ధరలే..: రాష్ట్రంలో విసనకర్రలు, లాంతర్ల పథకం అమలుకు వైకాపా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని.. శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. పిచ్చి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల్లోనే కాదు.. అధిక విద్యుత్ ధరల్లోనూ ఏపీ టాప్లో ఉందని దుయ్యబట్టారు. విజనరీకి.. ప్రిజనరీకి తేడా నేటి విద్యుత్ ధరలేనని యనమల అన్నారు. విజనరీ పాలనలో ధరలు పెంచిందే లేదు.. ప్రిజనరీ పాలనలో ఉద్యమంలా ధరలు పెంచుతున్నారని యనమల మండిపడ్డారు. మిగులు విద్యుత్ చంద్రబాబు విజన్ అయితే.., ఉత్పత్తి లేక ధరల పెంపు ప్రిజనరీ దిక్కుమాలిన పాలన అని ధ్వజమెత్తారు.
శ్లాబుల మార్పుతో ప్రజలపై భారం..: నాడు చంద్రబాబు దారిద్య్ర రేఖ దిగువన ఉన్న జనాభా సంఖ్య తగ్గించేందుకు చర్యలు తీసుకుంటే... నేడు జగన్ వీలైనంత మందిని దారిద్య్ర రేఖ దిగువకు నెట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని మండిపడ్డారు. నాడు బాదుడే బాదుడు అంటూ దీర్ఘాలు తీసిన జగన్... నేడు బాదుడుకు బలి కాలి వర్గం లేని వైనమని విమర్శించారు. శ్లాబుల మార్పుతో ప్రజలపై రూ. 11,600 కోట్ల భారం మోపుతున్నారన్నారు. చంద్రబాబు ముందుచూపునకు నిదర్శనంగా సోలార్, విండ్ ఒప్పందాలు చేసుకుంటే... జగన్రెడ్డి విధ్వంసం, వికృత చర్యలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు

Related Posts