- శైలజా కిరణ్ తో పాటు మార్గదర్శి సంస్థ అధికారులపైనా కేసులు
- నాంపల్లి కోర్టులో ప్రయివేటు పిటిషన్ వేసిన సంగీత అనే మహిళ
ప్రముఖ వ్యాపార వేత్త, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కోడలు శైలజా కిరణ్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ఆమె ప్రస్తుతం మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
చిట్ ఫండ్ సిబ్బంది గ్యారెంటరైనా సంగీత సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇల్లిగల్ అటాచ్ మెంట్ చేశారని నాంపల్లి కోర్టు లో ప్రయివేటు ఫిర్యాదు ధాఖలు అయింది. సంగీత అనే వ్యక్తి ఈ పిటిషన్ ప్రయివేటు కేసు వేశారు.
దీంతో ఆమె పిటిషన్ ను పరిశిలించిన నాంపల్లి కోర్టు తక్షణమే శైలజా కిరణ్ మీద కేసు నమోదు చేయాలని నాంపల్లి పోలీసులను ఆదేశించింది. దీంతో శైలజా కిరణ్ పై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. అయింది.
కోర్ట్ ఆదేశాల మేరకు మార్గదర్శి చిట్ ఫండ్ ఎండి శైలజ కిరణ్ తో పాటు తిరుమలగిరి బ్రాంచ్ మేనేజర్ పార్ధ సారధి, సంపత్, చిట్ ఫండ్ కంపెనీ పై కేసు నమోదు చేశారు నాంపల్లి పోలీసులు.
వీరందరిపై ఐపిసి 420, 468, 471, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నాంపల్లి పోలీసులు.