YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం కొత్త రికార్డులు

రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం కొత్త రికార్డులు

హైదరాబాద్, ఏప్రిల్ 1,
తెలంగాణలో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం కొత్త రికార్డులు సృష్టించింది… ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం వచ్చినట్టు గణాంకాలు వెల్లడించారు అధికారులు.. ఒక్క మార్చి నెలలోనే రూ.1,501 కోట్ల ఆదాయం రాగా… ఈ ఆర్థిక సంవత్సరంలో (2021-22) మొత్తంగా రూ. 12,364 కోట్ల ఆదాయం స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరింది.. ఇక, గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.. ఎందుకంటే.. గత ఏడాది (2020 – 21 ) రూ.5,260 కోట్ల ఆదాయం మాత్రమే రాగా.. ఈసారి మాత్రం రూ.12,364 కోట్లకు పెరిగింది.. మరో విశేషం ఏంటంటే.. ఈ ఏడాది టార్గెట్‌ రూ. 12 వేల కోట్లుగా పెట్టుకుంది ప్రభుత్వం.. టార్గెట్‌ను కూడా అధిగమించింది రిజిస్ట్రేషన్స్ శాఖ. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలు ఈ ఏడా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెరిగిన విషయం తెలిసిందే.. కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రావడం.. కొత్త విలువల ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరగడంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది.. వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువ కనీసం 50 శాతానికి, ఖాళీ స్థలాల విలువలను 35 శాతానికి, ఫ్లాట్ల విలువలను 25 శాతానికి సవరించింది ప్రభుత్వం.. ఈ విలువలకు 7.5 శాతం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు అమలు చేస్తున్నారు.. డిమాండ్‌ అధికంగా ఉన్న ప్రాంతాల్లో అయిదు నుంచి పది శాతం వరకూ కూడా విలువ పెరిగింది. ఈ పరిణామాలు అన్నీ మార్చి నెలలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం అమాంతం పెరగడానికి దోహద పడ్డాయి

Related Posts