YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పార్టీకి తలనొప్పిగా నేత

పార్టీకి తలనొప్పిగా నేత

నిజామాబాద్, ఏప్రిల్ 1,
ఇప్పుడా ఆ నేత‌ వ్య‌వ‌హ‌రం ఆ జిల్లా పార్టీకే త‌ల‌నోప్పిగా మారింద‌ట… ఇప్ప‌టికే ఎన్నో ఆరోప‌ణ‌ల న‌డుమ హెచ్చరిస్తూ నెట్టుకోస్తున్న రోజు రోజుకు మితిమీరి పోతుంద‌ట అత‌ని వ్య‌వ‌హ‌రం.. అవినీతి ఆరోప‌ణ‌లతో పాటు, స్ట్రీట్ పైట్ కు దిగుతున్నాడని పిలిచి మంద‌లించిన తీరు మార‌లేద‌ట.. ఇక నుండి జాగ్ర‌త్త‌గా ఉంటా అని చేప్పి హ‌మీ ఇచ్చి ఇప్పుడు మ‌ళ్లి కొత్త క‌థ‌కు తెర లేపుతున్నాడనే ప్ర‌చారం ఇప్పుడు నిజామాబాద్ టాక్ అప్ ది టౌన్ గా మారింది.. వాళ్ల కింది వీళ్ల కింద ఎందుకు కొత్త దుకాణం స్టార్ట్ చేద్దాం అనుచ‌రుల ద‌గ్గ‌ర మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టేస్తున్నాడ‌ట..రాజకీయాల్లో ఎవరు ఎలా మారుతారో చెప్పలేం. ఇప్పుడు నిజామబాద్‌ టీఆర్‌ఎస్‌లో పరిస్థితి అలాగే ఉంది. మ‌న‌వాడే క‌దా అని.. నమ్మి ప‌ద‌విస్తే ఇప్పుడు పార్టీకే పెద్ద తలకాయనొప్పిగా మారిపోయాడంట మేయర్‌ నీతూ కిరణ్‌ భర్త దండుశేఖర్. తాజాగా, నిజామబాద్‌ రూరల్‌ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ అల్లుడు సంపత్‌ అలియాస్‌ పింపు వాహనంపై శేఖర్‌ అనుచరులు దాడి చేయడం పెద్ద సంచలనమే అయ్యింది. నిత్యం వివాదాల్లో ఉంటున్న మేయ‌ర్ హబ్బీ.. ఇప్పుడు మ‌రొ క‌థ‌కు తెర‌లేపుతున్నాడ‌ట.నిజామాబాద్‌లో ఓ స్థలం వివాదానికి సంబంధించి.. మోటాడి సంపత్‌కు, దండు శేఖర్‌కు మధ్య ఘర్షణలు జరిగాయి. ఏకంగా సంపత్‌ వాహనంపై శేఖర్ అనుచరులు దాడికి దిగారు. ఇది పొలిటికల్‌ హీట్‌ను పెంచింది. ఈ వ్యవహారంపై.. ఇద్ద‌రు ఎమ్మెల్యేలు గోవర్దన్‌, గ‌ణేష్ గుప్తా సీరియస్‌ అయ్యారట. జిల్లా కేంద్రంలో ఎలాంటి అవినీతికి తావు లేద‌నీ… మేయ‌ర్ పేరిట బెదిరింపుల‌కు దిగితే తీవ్ర చ‌ర్య‌లు ఉంటాయని హెచ్చ‌రించార‌ట. మున్సిప‌ల్ మంత్రి కేటిఆర్ ఆఫీస్‌ నుంచి కూడా శేఖర్‌కు గట్టిగానే అంక్షింతలు పడ్డాయంట.ఈ మధ్య మరో కొత్త ప్రచారం మొదలెట్టాడంట దండు శేఖర్‌. రాబోయే కాలానికి.. కాబోయే ఎమ్మెల్యేను నేనే అంటూ.. అనుచరుల దగ్గర చెప్పుకొంటున్నారడట. నాకేం తక్కువ.. ఓటు బ్యాంక్ ఉంది.. అంగ, ఆర్థిక బలం ఉంది.. స‌మ‌యం కోసం వేచి చూద్దాం అంటున్నాడట ఈ మేయర్‌ భర్త. అవసరానికి పనికొస్తాయని… ఇతర పార్టీల‌తోనూ ట‌చ్ లో ఉన్నాడట. భార్య నీతూ మేయర్‌గా ఉండటంతో.. ఆ పదవీ కాలం అయ్యేదాకా ఓపిక పడుదామంటూ అనుచరులకు చెబుతున్నాడట సారు. అదైపోగానే.. బీఎస్పీలోకి జంపైపోవాలని చూస్తున్నాడట. ఇప్పటికే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో చర్చలయ్యాయని టాక్‌.కాంగ్రెస్‌ నుంచి వచ్చినా… ప్రియారిటీ ఇచ్చినందుకు బాగానే బుద్ధి చెప్పాడు అనుకుంటున్నాయట టీఆర్‌ఎస్‌ వర్గాలు. కార్పొరేషన్‌ ఎన్నిక‌ల్లో శేఖ‌ర్ ఓడినా.. అత‌ని భార్య గెల‌వ‌డంతో మేయ‌ర్ పీఠం ఎక్కించినందుకు మంచి బహుమతే ఇచ్చాడని గుసగుసలాడుకుంటున్నారట నేతలు. బలంగా సపోర్ట్ చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలకూ ఇప్పుడు పంటికింద రాయిలా తయ్యారడట శేఖర్‌. నిజామబాద్‌ రూరల్‌, అర్బన్‌.. ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలని డిసైడయ్యాడట. ఇప్పటికే, మేయర్‌ భర్తగా చాలా అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు శేఖర్‌పై విమర్శలున్నాయి. దీంతో, అతని భార్యతో రాజీనామా చేయించాలని చూస్తోందట టీఆర్‌ఎస్‌. అందుకే, ముందు జాగ్రత్తగా ఇతర పార్టీల పంచన చేరేందుకు సిద్ధమవుతున్నాడట.

Related Posts