YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రామాలయంలో క్రైస్తవ ప్రార్ధనలు జరగలేదు జిల్లా ఎప్సీ వివరణ

రామాలయంలో క్రైస్తవ ప్రార్ధనలు జరగలేదు జిల్లా ఎప్సీ వివరణ

కాకినాడ
తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురం సబ్ డివిజన్, పామర్రు పోలీస్ స్టేషన్ పరిధి కే గంగవరం గ్రామంలో “రామాలయంలో యేసు ప్రార్ధనలు పెట్టడం జరిగిందని” సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పోలీసులు స్పష్టం చేసారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్యపీ రవీంద్రనాథ్ బాబు, మాట్లాడుతూ గంగవరం గ్రామంలో “కాదా మంగాయమ్మ” అనే మహిళ గత కొన్ని సంవత్సరాల నుంచి తన ఇంటి ముందు ఉన్న రోడ్డు మీద ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. అదే రోడ్డుకి ఆనుకుని ఉన్న రామాలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయని ఈ విషయంలో స్థానిక హిందువులకు,  క్రిస్టియన్లకు కలసిమెలసి ఉంటున్నారని, ఎటువంటి వివాదాలు లేవని అన్నారు. ఇటీవల మంగాయమ్మకు, కాకినాడలో ఉంటున్న ఆమె పెద్ద కుమారుడైన కాదా శ్రీనివాస్ తో ఆర్ధిక వివాదాలు ఏర్పడ్డాయి.  తన తల్లి ప్రార్ధనల పేరుతో డబ్బు వృధా చేస్తుందని ఘర్షణ పడ్డాడు. ఈ విషయంలో మంగాయమ్మ, మరికొందరు డయల్ 100 కు ఫోన్ చేసారు. పోలీసు సిబ్బంది అక్కడకు వెళ్లి తల్లి కొడుకులకు సర్ది చెప్పారు. ఈ విషయమై కాదా శ్రీనివాస్ కు వరసకు సోదరుడైన అదే గ్రామం లో ఉంటున్న కాదా వెంకట రమణ తన అన్నయ్య కాదా శ్రీనివాస్ పై డయల్ 100 కు ఫిర్యాదు చేసారనే నెపంతో “రామాలయం లో ప్రార్ధనలు ఏ విధంగా పెడతారు” అని ఉద్దేశపూర్వకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి తప్పుడు ప్రచారం చేసాడని అయన అన్నారు. ని ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు.  ఈ విషయం లో ఎవరిపైనా ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని జిల్లా ఎస్పీ అన్నారు.

Related Posts