YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మత్తులో చిత్తు

మత్తులో చిత్తు

నగరంలో డ్రగ్స్ వ్యసనం దారుణంగా పె రుగుతోంది. యువత ఈ వ్యసనానికి బానిసలై, బయటకు రాలేక అర్ధంతరంగా ప్రాణాలు పో గొట్టుకుంటున్నారు. ఈ మధ్య ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌, డీజిల్‌ కాలనీకి చెందిన మరో యువకుడు రోడ్డు ప్రమాదాల్లో దారుణంగా చనిపోయారు. ఇలాంటి వారు ఎంతో మంది ఈ వ్యసనానికి బలవుతూనే ఉన్నా వివరాలు పూర్తి స్థాయిలో వెలుగు చూడడం లేదు. వ్యసనం మనిషి జీవితాన్ని సర్వనాశనం చేస్తోంది. మద్యం, గంజాయి బానిసలే కాదు.. మందుల షాపుల్లో అవలీలగా లభించే సాధారణ ఫోర్ట్‌విన్‌, పెనార్గన్‌, ఎవిల్‌ లాంటి ఇంజక్షన్‌లే కాదు.. వివిధ రకాల దగ్గు మందులు సైతం వ్యసనపరులకు వరంలాగా మారుతున్నాయి. ఆల్కహాల్‌తో పోల్చుకుంటే ధర తక్కువ కావడం, ఇంట్లో కుటుంబ సభ్యులు గుర్తుపట్టకుండా ఉండే సదుపాయం ఉండడం వల్ల వీటివైపుమొగ్గుతున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో దాదాపు 500లకు పైగా తీవ్రమైన వ్యవసనపరులు ఉన్నారు. ఒక్క ప్రగతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్వర్యంలోనే ఇపుడు 216 మంది వ్యసనం నుంచి విముక్తి పొందేందుకు అవసరమైన చికిత్స పొందుతున్నారు.

కొన్ని మందుల షాపులు ప్రత్యేకంగా ఇలాంటి వారికి ఇంజక్షన్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. నిజానికి ఆ ఇంజక్షన్‌ వేసుకోకపోతే విలవిల్లాడుతుంటా రు. దీంతో వారి బలహీనతను వారు వాడుకుంటారు. చాలా మందుల షాపుల్లో వీరిని గుర్తించి, డాక్టర్‌ చీటి ఉంటే తప్ప అమ్మేది లేదంటూ నిరాకరిస్తారు. దీంతో వ్యసనపరుల కోసం ప్రత్యేకంగా ఈ మందులను సరఫరా చేసే మందుల షాపులను మాత్రమే ఆశ్రయిస్తారు..

అసలే అంటువ్యాధులతో జబ్బులు దారుణంగా వ్యాపించే రోజులివి.. హెచ్‌ఐవీ లాంటి ప్రమాదకర జబ్బులు వ్యాపించడానికి ఇదో మార్గం. ఒక నిర్జన ప్రదేశంలో కలుసుకుని ఒక ఇంజక్షన్‌ పది మంది నరాలకు ఇచ్చుకుంటారు. ఇంజక్షన్‌ ద్వారా మందు శరీరంలోకి వెళుతుంటే తన్మయత్వం పొందుతారు. వ్యవసపరుల్లో పరస్పర సహకారం ఎక్కువే కావడంతో.. ఒకే ఇంజక్షన్‌ పంచుకోవడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాధులు వ్యాపిస్తుంటాయి. దీంతో వీరు మరింత ప్రమాదకర స్థితిలో పడుతుంటారు. నగరంలోని నిర్జన ప్రదేశాల్లో వీరు కలుసుకునే ప్రాంతాలను హాట్‌స్పాట్‌ కేంద్రాలు అంటారు. కాజీపేట రైల్వే, వరంగల్‌ రైల్వే స్టేషన్‌ పరిసరాలు, రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు, శివనగర్‌, రంగలీల మైదానం, చింతల్‌ ఫ్లైఓవర్‌, పైడిపల్లి, భద్రకాళి గుట్టలు, భద్రకాళి చెరువు కట్ట, మైత్రినగర్‌, ఫాతిమా నగర్‌, భవాని థియేటర్‌ పరిసరాలు, బాపూజీనగర్‌ ప్రాంతాలతో పాటు ఇతర నిర్మానుష్య ప్రాంతాల్లో వీరి కార్యకలాపాలు నిత్యం జరుగుతుంటాయి.

ప్రాణాంతకమైన వ్యాధుల బారినుంచి వీరిని కాపాడేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, అధ్వర్యంలో ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు. ఈ వ్యసనపరులను గుర్తించి వ్యవస విముక్తి కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నారు. వీరిని వ్యవసనం నుంచి విముక్తి కల్పించి జనజీవన స్రవంతిలో కలిపేందుకు ప్రగతి సేవా సమితి స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వమే వారికి సిరంజిలు సరఫరా చేస్తుంటారు. ఏడాది పొడువునా దాదాపు 7638 నూతన సిరంజీలను అందజేశారు.

Related Posts