YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

నష్టాల్లో కోనసీమ రైతులు

నష్టాల్లో కోనసీమ రైతులు

అమ్మబోతే అడవి... కొనబోతే కొరివి అన్నట్టుగా తయారైంది కొబ్బరి రైతుల దుస్థితి. కన్నకొడుకు ఆదుకున్న లేకపోయినా కొబ్బరి చెట్టు ఆదుకొంటుందని కోనసీమ వాసుల నమ్మకం. కొబ్బరి చెట్టును కల్పతరువుగా పూజిస్తారు కోనసీమ వాసులు . కొబ్బరి ఉత్పత్తుల పేరు చెబితే గుర్తొచ్చేది కేరళ తరువాత కోనసీమ కొబ్బరి మాత్రమే. గత కొన్ని ఏళ్లుగా కోనసీమ కొబ్బరి రైతులు దిగుబడి లేక నల్లి తెగుళ్ల వల్ల ఉత్పత్తి తగ్గిపోయి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో మార్పుల వలన కొబ్బరి ఉత్పత్తిలో మార్పువచ్చి రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఏటా సెప్టెంబర్ నెల రెండవ తేదీన ప్రపంచ కొబ్బరి దినోత్సవం జరుపుకుంటారు కొబ్బరి రైతులు. కొబ్బరిపంట పై ఆధారపడిన రైతుల పరిస్థితి ఎలా వుందో చూద్దాం.కోనసీమ అంటే పచ్చని తివాచీ పరచినట్లుగా ప్రకృతి అందాలతోను , పిల్ల కాలువలతోను ,చుట్టూ గోదావరి అందాలతోను కొబ్బరి తోటలతోను అలరారుతూ వుంటుంది. కోనసీమలో సుమారు లక్షా ఐదువేల ఎకరాల్లో కొబ్బరిపంట సాగు సాగవుతోంది. అరవై కోట్ల కొబ్బరికాయలు ఇక్కడినుంచి వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. 1996 లో సంభవించిన తుఫాన్ తరువాత ఆ పరిస్థితి కోనసీమ లో కనుమరుగయ్యింది. ఈ కోనసీమలో ఎక్కువశాతం రైతులు కొబ్బరి పంట మీదే ఆధారపడి వుంటారు.1996 తర్వాత ఆశించిన దిగుబడి లేక , అనుకున్న ధరలేక కొబ్బరి రైతు విలవిలలాడిపోయాడు . కొంతమంది కొబ్బరి రైతులు కొబ్బరి తోటలను అయినకాడికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు . ఈ లోగా 2008 సంవత్సరంలో అనూహ్యంగా ధర పెరగడంతో రైతు కళ్ళల్లో ఒకింత ఆనందం వెల్లివిరిసింది . ఈలోగా దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న సామెత కొబ్బరి రైతులకు ఎదురయ్యింది. ధర పెరిగిన ఆనందంలో ఉన్న కొబ్బరి రైతుకి నల్లి తెగుళ్ల రూపంలో కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయాడు కొబ్బరి రైతు . అక్కడి నుండి కొబ్బరి మార్కెట్లు నుండి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కొబ్బరి పంటపై ఆసక్తి తగ్గించాడు కొబ్బరి రైతు.మరలా 2008 తరువాత 2017 ఆగస్టు మాసం నుండి ధరలు పెరగడంతో కొబ్బరి రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి . ఈలోగా కొబ్బరికి రుగోస్ అనే కొత్త వైరస్ రావడంతో ఏంచెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితిలో కొబ్బరి రైతు వున్నాడు . అంతలోనే కొబ్బరి ధరలు పతనం అవ్వడంతో కొబ్బరి పంట పై రైతు పెద్దగా ఆసక్తి కనబరచడంలేదు . అందుకే కొబ్బరి తోటలను అయినకాడికి రియలె ఎస్టేట్ దళారులకు అమ్ముకుంటున్నాడు. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు , సంభవించిన వరదలకు కొబ్బరి తోటలకు ఆశించిన తెల్లదోమ ప్రభావం తగ్గి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందని రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.ఒకపక్క కరోనా వైరస్ ఎగుమతులు కూడా అంతంత మాత్రం గానే జరుగుతుండటంతో రైతు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాడు. కొబ్బరికి ఎక్కువగా కలిసొచ్చే కాలం సెప్టెంబర్ ,అక్టోబర్ ,నవంబర్ మాసాలు , ఈ మాసాల్లో కొబ్బరికి అధిక డిమాండ్ వుండి బీహార్ , మహారాష్ట్ర , జార్కండ్ , రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంది. అయితే ధరల ఒడిదుడుకులతో నష్టపోతున్న తమను ఆదుకోవాలని కొబ్బరి రైతులు ప్రభుత్వాలను కోరుతున్నారు.

Related Posts