YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

నరసరావుపేటలో రియల్ బూమ్

నరసరావుపేటలో రియల్  బూమ్

కొత్త జిల్లా ప్రకటనతో ఏపీలోని కొన్ని ప్రాంతాలలో రియల్ బూమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చుట్టుపక్కల భూముల ధరలు రెట్టింపయ్యాయి.దీంతో పొలాలన్నీ వెంచర్లుగా మారిపోతున్నాయి. గుంటూరు జిల్లాలోని కొత్తగా రాబోతున్న పల్నాడు జిల్లాలో రియల్ బూమ్ ఊపందుకుంది. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు ప్రకటనతో పల్నాడు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా జిల్లా కేంద్రానికి రావాలంటే 125 కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారింది. కొత్తగా జిల్లా ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. నర్సరావుపేటలో జిల్లా కార్యాలయాలా ఏర్పాట్లు చివరిదశకు చేరుకున్నాయి. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు ఇతర జిల్లా శాఖల కార్యాలయాలు కూడా పేటకు రానున్నాయి. దీంతో ఈ ప్రాంతం మొత్తం హడావుడిగా మారిపోయింది. ఇదే సమయంలో నర్సరావుపేటలో రియల్ బూమ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.కొత్త జిల్లా కేంద్రంగా నర్సరావుపేట మారనుండడంతో ఈ ప్రాంతంలో భూములు కొనేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇక్కడ భూముల ధరలు రెట్టింపయ్యాయి. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటవుతున్న లింగంగుట్ల రోడ్డు, ఉప్పలపాడు రోడ్డు, సత్తెనపల్లి రోడ్లలో భూముల ధరలు రెట్టింపయ్యాయి. ఇక నర్సరావుపేటనుంచి రావిపాడు వెళ్లే రోడ్డు, పాలపాడు రోడ్డు, వినుకొండ రోడ్డులో కూడా ధరలు భారీగానే పెరిగాయి. రియల్ బూమ్ పెరగడంతో వ్యాపారులు కూడా ఇక్కడ కొత్త కొత్త వెంచర్లు మొదలుపెట్టారు. రైతులనుంచి పొలాలు కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. నర్సరావుపేట చుట్టుపక్కల దాదాపు 100కుపైగా కొత్త వెంచర్లు రావడంతో ఇక్కడ రియల్ బూమ్ ఏర్పడింది.మరోవైపు నర్సరావుపేటలో స్థలాలు కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాలవారు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, గుంటూరు ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా నర్సరావుపేటలో స్థలాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పేటలో కొత్తగా ఏర్పాటు చేసిన వెంచర్లలో స్థలాలు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.గతంలో 20నుంచి 30లక్షలు ఉన్న పొలాల ధరలు ఇప్పుడు ఏకంగా కోటిరూపాయలకు చేరాయి. స్థలాల ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. గతంలో సెంటు స్థలం ధర 4లక్షల వరకూ ఉంటే ప్రస్తుతం 8నుంచి 10 లక్షల వరకూ పలుకుతుందంటున్నారు స్థానికులు. కొత్త జిల్లా ప్రకటన తర్వాత పేటలో స్థలాల ధరలు రెట్టింపయ్యాయంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే భూముల ధరలు రెండురెట్లు పెరిగాయి కూడా. చుట్టుపక్కల ప్రాంతాలనుంచి స్థలాలు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తుండడంతో భూముల రేట్లు పెరిగాయంటున్నారు స్థానికులు. జిల్లా ఏర్పాటు కాకముందే ధరలు ఈ స్థాయిలో పెరిగితే భవిష్యత్తులో పేటలో భూముల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు

Related Posts