YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గల్లా చరిత్ర...కనుమరుగేనా

గల్లా చరిత్ర...కనుమరుగేనా

తెలుగు దేశం పార్టీలో ఆమెది చిన్న స్థాయేం కాదు. మొన్నమొన్నటి దాకా కీలక పదవిలో ఉన్నారు. కానీ, ఇప్పుడంతా సీన్‌ రివర్స్‌. సొంత జిల్లా చిత్తూరు రాజకీయాలకు కూడా ఆమె దూరంగా ఉంటున్నారు. క్యాడర్‌కూ టచ్‌లో లేరు. అనుచరులకూ అందుబాటులో లేరు. అసలు పార్టీలో ఉన్నట్టా? లేనట్టా? ఆమె అసంతృప్తికి కారణమేంటి? అన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతల్లో కీలక చర్చ మొదలైందిచిత్తూరు జిల్లా రాజకీయాల్లోనే కాదు, ఉమ్మడి ఏపీలోనూ.. రాజకీయంగా గుర్తింపు పొందిన మహిళానేత గల్లా అరుణకుమారి. చెప్పాలంటే.. అరగొండ నుంచి అమెరికా వరకు.. ప్రతి తెలుగువారికీ ఆమె సుపరిచితురాలే. చంద్రగిరి నుంచి 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. ఉమ్మడి ఏపీలో మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అరుణ... రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. నిన్న మొన్నటి దాకా పొలిట్‌ బ్యూరో సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఇప్పుడు మాత్రం అజ్ఞాతంలో ఉన్నట్టుగా తయారైంది పరిస్థితి.2014లో చంద్రగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఓడిన అరుణ.. దాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొన్నాళ్లు పార్టీ పటిష్టతకు కృషిచేసినా.. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. చాన్నాళ్ల పాటు అమెరికాలోనే ఉన్న అరుణ.. కరెక్టుగా 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి షాకిచ్చారు. నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కుమారుడు గల్లా జయదేవ్‌.. గుంటూరు ఎంపీగా బరిలో నిలవడంతో ఆ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా రాజకీయాల్ని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఇక, అప్పట్నుంచి ఆమె జిల్లా లీడర్లకే కాదు, లోకల్‌ క్యాడర్‌ కూడా కనిపించలేదట.2019 ఎన్నికల తర్వాత గల్లా అరుణకుమారి.. అసలు చంద్రగిరి వైపు కన్నెత్తి చూడలేదట. గల్లా గ్రోత్‌ కారిడార్‌కు కేటాయించిన భూముల్లో కొంత వెనక్కి తీసుకోవడం, అమరరాజా పరిశ్రమ కాలుష్య అంశంపై నోటీసులు జారీ కావడం.. ఆమెను చికాకు పెట్టాయట. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపైనే కాదు, సొంత పార్టీ వైఖరిపైనా సీరియస్‌గానే ఉన్నారట అరుణమ్మ. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయరు, సొంత పార్టీ కార్యక్రమాలకూ రారు. దీంతో అరుణ అనుచరగణం నిరాశలో కూరుకపోయిందట.నడిపించే నాయకురాలే లేనప్పుడు.. క్యాడర్‌ ఎన్నాళ్లని ఎదురుచూస్తుంది. అందుకే, గల్లా అరుణ అనుచరుల్లో చాలామంది.. 2019 ఎన్నికలకు ముందే టీడీపీకి దూరమయ్యారు. టీడీపీ పొలిట్‌ బ్యూరోకు దూరమైన అరుణ.. పార్టీలో యాక్టివ్‌గా లేకపోవడానికి కారణం హైకమాండ్‌ సరైన ప్రయారిటీ ఇవ్వకపోవడమేనని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారట. అయితే, టీడీపీలో కొనసాగడం కూడా ఆమెకు ఇష్టం లేదనే టాక్‌ కూడా వినిపిస్తోంది. కొడుకును ఎంపీగా చూసిన అరుణ.. మనవణ్ని వెండితెరపై హీరోగా చూసుకుని మురిసిపోతున్నారట. అందుకే, ఇక రాజకీయాలు చాలు అనే భావనకు ఆమె వచ్చి ఉంటారనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఈ ప్రచారాలు ఎలా ఉన్నా... ఆమె మౌనం వీడితే తప్ప అసలు విషయం బయటకు రాదు

Related Posts