ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన మాదిరిగానే రాష్ట్రంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖను పటిష్ట పరిచేందుకు అన్ని విభాగాలలో (ఎస్ ఐ అధికారి స్థాయి నుండి అదనపు కమిషనర్ స్థాయి అధికారుల వరకు) పదోన్నతులు, పోస్టుల అప్ గ్రేడేషన్ లతో పాటు పోస్టింగ్స్ లకు ఆమోదం తెలిపారని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
హైదరాబాద్ లోని మంత్రి న క్యాంప్ కార్యాలయంలో శనివారం ఉదయం ఉగాది పండుగ సందర్భంగా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులకు పోస్టింగ్స్ పత్రాలను (GO కాపీలను) ఆబ్కారీ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తో కలసి అధికారికంగా అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గుడుంబా, గంజాయి లను సమర్ధవంతంగా నిర్ములించామన్నారు. అలాగే రాష్ట్రంలో డ్రగ్స్ నిర్ములనకు ఉక్కుపాదం మోపాలని మంత్రి ఆదేశించారు. పదోన్నతులు సాధించిన అధికారులను మంత్రి అభినందించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు మరింత సమర్ధవంతంగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అజయ్ రావు, హరికిషన్, అంజన్ రావు, డేవిడ్ రవికాంత్, కే ఏ బి శాస్త్రి, ఖురేషి, సురేష్ రాథోడ్, చంద్రయ్య గౌడ్, దత్తరాజు గౌడ్, సత్యనారాయణ, రవీందర్ రావు, గణేష్ గౌడ్, కిషన్ నాయక్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.