హైదరాబాద్, ఏప్రిల్ 2, (న్యూస్ పల్స్)ప్రభుత్వాల ఖజానాకు మద్యానికి మించిన కిక్ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల ఖజానాలకు ఆరు బీర్లు-మూడు విస్కీ బాటిళ్ళలాగా వర్థిల్లుతున్నాయి. తెలంగాణలో మద్యం కిక్ తో ఖజానా గలగలమంటోంది. రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయని తెలంగాణ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గురువారం ఒక్క రోజే రూ.303 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో ప్రస్తుతం 2,620 వైన్స్‌తో పాటు వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లున్నాయి. మద్యం అమ్మకాల్లో గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల్లోనే వాటా ఎక్కువ ఉంది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లోనే రూ.10 వేల కోట్లకు పైగా అమ్మకాలుఈ ఆర్థిక సంవత్సరం లో డిపోల నుండి 2021-22లో మద్యం అమ్మకాలు రూ.30 వేల 780 కోట్లు జరిగాయి. మార్చి నెలలో రూ.2 వేల 810 కోట్లు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాదితో పోలిస్తే గత ఏడాది అమ్మకాలు మూడువేల వరకూ తక్కువగా నమోదయ్యాయి. 2020-21లో మద్యం అమ్మకాలు 27,289 కోట్లుగా నమోదయ్యాయి. ఏ విధంగా చూసినా నెలకు రూ.2500 కోట్ల నుంచి 3 వేల కోట్ల వరకూ అమ్మకాలు సాగుతున్నాయి. అంటే రోజుకి సరాపరి 100 కోట్ల వరకూ మద్యం తాగేస్తున్నారు.పండగలు, పబ్బాలు వచ్చాయంటే మద్యం తాగేవారి సంఖ్య పెరుగుతోంది. అందులోనూ సమ్మర్ ప్రారంభం కావడంతో బీర్ల అమ్మకాలు బాగా పెరిగాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.6,700 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. ఇవాళ్టి నుంచి ప్రారంభమయిన ఆర్థిక సంవత్సరంలో 4 వేల కోట్లు అదనంగా రాబట్టేందుకు సర్కారు లక్ష్యం నిర్దేశించింది. టాక్స్ పేయర్స్ పైనే ప్రభుత్వాలు ఆధారపడుతున్నాయి. దీనికి తోడు డ్రంక్ అండ డ్రైవ్ అంటూ తనిఖీలు చేపట్టి పోలీసులు అదనంగా లాగేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే మందుబాబులే ప్రభుత్వాలకు మహారాజపోషకులు అవుతున్నారు