రాజమండ్రి, ఏప్రిల్ 5,
ఇన్నాళ్లు ఆ గ్రామం తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఊరు రెండు జిల్లాల్లోకి వెళ్లింది. గ్రామంలో ఒక వైపు ఇళ్లన్నీ కోనసీమ జిల్లాలోకి వెళ్లగా.. మరోవైపు ఉన్న ఇళ్లన్నీ రాజమండ్రి కేంద్రంగా ఉన్న జిల్లాలోకి వెళ్లిపోయాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా చిన్న ద్వారం పూడి గ్రామంలో ఈ వింత పరిస్థితి నెలకొంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఎదురెదురుగా ఉన్న చుట్టాలు సైతం వేర్వేరు జిల్లాల్లోకి మారిపోయారు. దీంతో అనపర్తి మండలం, మండపేట మండలంలో ఉన్న చిన్న ద్వారం పూడి గ్రామంలో గందరగోళం నెలకొంది. ఓకే గ్రామంలో ఎదురుగా ఉన్న తాము వేరు వేరు జిల్లాలు గా విడిపోయామంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.తమను కోనసీమ జిల్లా నుండి విడదీసి దగ్గరలో ఉన్న రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్న ద్వారంపూడి గ్రామస్తులకు అదే గ్రామానికి చెందిన ఎదురుగా ఉంటున్న గ్రామస్థులు మద్ధతు తెలియజేస్తున్నారు.