YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గోన్న మంత్రి జగదీష్

బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గోన్న మంత్రి జగదీష్

సూర్యాపేట
బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి సందర్బంగా  సూర్యాపేట లోని ఎమ్మెల్య క్యాంపు కార్యాలయం నుండి కొత్త బస్టాండ్ వద్ద గల జగ్జీవన్ రామ్ విగ్రహం వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి ర్యాలీలో పాల్గొని జగ్జీవన్ రామ్  విగ్రహానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, డిసిఎంఎస్  ఛైర్మన్ వట్టే జనయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్, జెడ్పీటీసీ లు, ఎంపీపీ లు, కౌన్సిల్ ర్ లు, దళిత సంఘ నాయకులు, తెరాసా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గోన్నారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా డా. బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలు
సిద్దిపేట జిల్లా కేంద్రంలో డా. బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.  సిద్దిపేట పట్టణంలోనీ బిజేఆర్  కూడలిలో డా. బాబు జగ్జీవన్ రామ్ నిలువెత్తు విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి  తన్నీరు హరీష్ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు   మాట్లాడుతూ   జగ్జివన్ రామ్ 1952 నుండి వరసగా 8సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, సుధీర్ఘ కాలం కేంద్ర మంత్రి గా పని చేశాడు.  పేద వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు.  గాంధీ జి ఎన్నో సందర్భాలలో జగ్జివన్ రామ్ ను కొనియాడారు.  ఎన్నో పదవులు సుదీర్ఘ కాలం అనుభవించిన చాలా నిరాడంబర జీవితం గడిపారు.  అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన మహనీయుడు.  సీఎం కెసిఆర్ అంబెడ్కర్, జగ్జివన్ రామ్ కలలను నిజం చేస్తున్నారని అన్నారు.
ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పది లక్షల రూపాయల నగదు బదిలీ చేసే దళిత బంధు పథకం తెలంగాణలోనే ఉంది.  ఇప్పటి వరకు విద్య, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్ ఉంటే నేడు సీఎం కెసిఆర్ అన్ని రంగాల్లో రిజర్వేషన్ తెచ్చారు. ఎస్సీ సంక్షేమ నిధి ఎక్కడ లాబ్స్ కాకుండా చట్ట భద్రత చేసిన ప్రభుత్వం టి ఆర్ ఎస్ మాత్రమే.  ఎస్ టి సబ్ ప్లాన్ నిధుల కంటే ఎస్సీ నిధులను అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.  మన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం.  సిద్దిపేట జిల్లా కేంద్రంలో బాబు జగ్జివన్ రామ్ భవనాన్ని నిర్మించుకున్నామని అన్నారు.

Related Posts