YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మద్దతు ధరపై కేంద్రం అలోచించాలి : మంత్రి కేటీఆర్

మద్దతు ధరపై కేంద్రం అలోచించాలి : మంత్రి కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పనులు జోరుగా సాగుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. వేములవాడ మండలం హన్మాజీపేట, ఇల్లంతకుంట, వేములవాడ మండలాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. రైతుబంధు చెక్కుల పంపిణీలో మంత్రి పాల్గొన్నారు. - డాక్టర్ సి. నారాయణరెడ్డి స్వగ్రామమైన హన్మాజీపేటలో సినారె పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటుకు భూమి పూజ చేసారు. మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకాన్ని నీతి ఆయోగ్ మెచ్చుకుందన్నారు. పంట పెట్టుబడి పథకంతో రైతులు పండగ చేసుకుంటున్నారన్నారు.   సినారె, మిద్దె రాములు హన్మాజీపేట కీర్తిని ప్రపంచానికి చాటిన మహనీయులు.  గ్రామ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తానని హామీ.ఇచ్చారు.  నేను ఎమ్మెల్యేగా గెలిచిన పదేళ్లలోఎన్నో పథకాలు చూసిన వాటిలో రైతు బంధు చాలా గొప్పగా ఉంది.  కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పరుగులు పడుతుంది.  వచ్చే యాసంగికి గోదావరి జలాలను ఇచ్చి తీరుతామని అయన అన్నారు.  పంట పెట్టుబడి పథకం పేరుతో రైతాంగానికి అన్ని విధాలా అండ.  జూన్ 2 న రైతుకు రూ. 5 లక్షల ఉచిత బీమా వంటి మరో అద్భుత కార్యక్రమానికి శ్రీకారమని అన్నారు.  ఇన్నాళ్లు పాలించిన పాలకులు రైతులను పట్టించుకోలేదు. రైతు యూనిట్ గా పంటల బీమా కు కేంద్రం కృషి చేయాలి.  దేశంలో తాను ఉత్పత్తి చేసిన పంటలకు ధర నిర్ణయించలేని స్థితిలో రైతు ఉన్నడు.మద్దతు ధరపై కేంద్రం ఆలోచన చేయాలి.  రైతు సమన్వయ సమితులు భవిష్యత్తులో మద్దతు ధరకు కృషి చేస్తాయని అన్నారు.  ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే మరింత మేలు జరుగుతుందని అన్నారు. గత పాలకులు రైతులను రాబంధుల మాదిరిగా పీక్కుతింటే మేం రైతులకు రైతు బంధులు గా మారుతున్నామని మంత్రి అన్నారు. 

Related Posts