హైదరాబాద్, ఏప్రిల్ 5,
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ) సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మార్చి 25న గ్రాండ్‌గా రిలీజైన ఈ ఫిక్షనల్ థ్రిల్లర్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ల అభినయాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. అందుకే సినిమా విడుదలై రెండు వారాలు గడుస్తున్నా కలెక్షన్లలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లు చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో రేటింగ్‌లోనూ టాప్ పొజిషన్లో నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్ తాజాగా మరో రికార్డు సృష్టించింది. అదేంటంటే.. ప్రముఖ మూవీ డేటా బేస్ సంస్థ IMDBలో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ సినిమాల జాబితాలో టాప్ 5 లో నిలిచిన ఏకైక ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది.ఈ జాబితాలో కోడా చిత్రం మొదటి స్థానంలో ఉంది. ఇటీవలే ఈ సినిమాకు అస్కార్ పంట పండింది. రెండో స్థానంలో డెత్ ఆన్ ది నైల్, మూడో స్థానంలో మార్బియస్, నాలుగో స్థానంలో బ్యాట్‌మెన్ సినిమాలు ఉన్నాయి. అయితే ఈ హాలీవుడ్ సినిమాల కంటే ఐదో స్థానంలో నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకే ఎక్కువ రేటింగ్ రావడం విశేషం. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది ఆర్‌ఆర్‌ఆర్ చిత్రబృందం. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్‌ల అభినయం, రాజమౌళి టేకింగ్ ఈ సినిమాను హాలీవుడ్ సినిమాల సరసన నిలబెట్టాయని చెప్పచ్చు. ఇక కీరవాణి అందించిన స్వరాలు, నేపథ్య సంగీతం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సీత పాత్రలో సందడి చేయగా, ఓలీవియా మోరీస్ మరో హీరోయిన్‌గా నటించింది. అజయ్ దేవ్‌గణ్, శ్రియాశరణ్, సముద్రఖని అతిథి పాత్రల్లో మెప్పించారు.