న్యూఢిల్లీ ఏప్రిల్ 5
దేశ భద్రతకు, విదేశీ సంబంధాలకు ఆటంకం కలిగిస్తున్న 22 యూట్యూబ్ చానెళ్లను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. ఇందులో 18 చానెళ్లు ఇండియాకు చెందినవి కాగా, మరో 4 పాకిస్తాన్ యూట్యూబ్ చానెళ్లు అని ఆ శాఖ స్పష్టం చేసింది. ఐటీ రూల్స్, 2021 ప్రకారం తొలిసారిగా 18 యూట్యూబ్ చానెళ్లను బ్లాక్ చేసినట్లు తెలిపింది.యూట్యూబ్ వీక్షకులను తప్పుదోవ పట్టించేందుకు కొన్ని టీవీ చానెళ్ల లోగోలను కూడా ఈ యూట్యూబ్ చానెళ్లు ఉపయోగించుకున్నాయని పేర్కొన్నది. తప్పుడు థంబ్ నెయిల్స్‌తో ప్రజలను గందరగోళపరిచినట్లు తెలిపింది. వీటితో పాటు 3 ట్విట్టర్ అకౌంట్లు, ఒక ఫేస్‌బుక్ అకౌంట్, ఒక న్యూస్ వెబ్‌సైట్‌ను కూడా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది.