YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అంబటికి... ఆమాత్య యోగం

అంబటికి... ఆమాత్య యోగం

గుంటూరు, ఏప్రిల్ 6,
సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకి జగన్ కేబినెట్‌లో సీటు గ్యారంటి అనే చర్చ అయితే కొత్తగా ఏర్పాటైన పల్నాడు జిల్లాలో తెగ వైరల్ అవుతోంది. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు.. విడుదల రజినీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. అంబటి రాంబాబు వైపే సీఎం జగన్ మొగ్గు చూపినట్లు సమాచారం. అదీ కూడా కేబినెట్‌లో కీలక శాఖను అంబటికి కట్టబెట్టాలనే ఓ కృతనిశ్చయంతో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఏర్పడిన ఈ జిల్లాలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజినీ.. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. 2019 ఎన్నికల్లో గెలిచి.. ఆమె తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. దీంతో క్యాస్ట్ ఈక్వేషన్స్ బట్టి ఆమెకు కేబినెట్‌లో ఛాన్స్ దక్కే అవకాశం కొద్దిగానే ఉందని సమాచారం. అలాగే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా పార్టీలో సీనియర్ నేత. కానీ ఆయన క్యాస్ట్ ఈక్వేషన్స్ బట్టి.. ఆయనకు కేబినెట్‌లో ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇక జగన్ తన పాత కేబినెట్‌లోని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. ప్లేస్‌ను ఈ అంబటి రాంబాబుతో ఫిల్ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. వచ్చేది ఎన్నికల వేళ.. గతంలో సత్తెనపల్లిలో కొడెల శివ ప్రసాద్ వర్గందే పై చేయి.. కానీ నేడు ఆ పరిస్థితి అక్కడ లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ సత్తెనపల్లిలో ఫ్యాన్ పార్టీ సత్తా చాటాలంటే.. అంబటికి మంత్రి పదవి ఇచ్చి తీరాలని సీఎం మొండి పట్టుతో ఉన్నట్లు.. సజ్జల కార్యాలయంలో ఓ టాక్ అయితే నడుస్తోంది.  ఇక అంబటి రాంబాబు గురించి అందరికీ తెలిసిందే. ఈ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడంటే.. అది ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ బాబు లేదా జనసేనాని పవన్ కల్యాణ్‌పైన అయినా ఉంటుందనే ఓ టాక్ అయితే.. ఇటు ప్రజల్లోనే కాదు.. అటు మీడియా వారికి కూడా బాగా అర్థమైపోయింది. అంబటి రాంబాబు నోరున్న నేత అన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు.. ఆయా పార్టీల నేతలపై అంబటి రాంబాబును నిద్రలో లేపి అడిగినా.. ఒంటి కాలితో లేచి.. వారిపై  మండిపతారన్న ఓ చర్చ అయితే ఫ్యాన్ పార్టీలోనే అండర్ కరెంట్‌గా రంజు రంజుగా నడుస్తోంది. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి జగన్ పార్టీ అభ్యర్థిగా అంబటి పోటీ చేసి టీడీపీ సీనియర్ నేత కొడెల శివప్రసాద రావు చేతిలో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత  2019 ఎన్నికల్లో మళ్లీ ఆయనపై పోటీ చేసి.. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా అంబటి రాంబాబు తన సత్తాను చాటారు. జగన్ తొలి కేబినెట్‌లోనే రాంబాబును తీసుకుంటారని అంతా భావించారు. కానీ కొత్త వారికి... ఆయన కంటే జూనియర్లకు జగన్ అవకాశం ఇచ్చారు. వైయస్ఆర్ ఫ్యామిలీకి నమ్మిన బంటుగా ఎవరైనా ఉన్నారంటే.. అదీ అంబటి రాంబాబు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే... ఆ ఫ్యామిలీకి 100కి 100 శాతం లాయిల్టీగా ఉండే వ్యక్తి ఈ అంబటి రాంబాబు. 1989లో రేపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 1994, 1999 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత.. అంబటి రాజకీయాల్లోనే ఉంటూ.. రాజశేఖర్ రెడ్డికి బాగా దగ్గరయ్యారు. క్రమంలో 2004లో నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి.. నీకు ఎమ్మెల్యే సీటు ఇస్తానంటే.. వద్దు వద్దు.. మీరు ముఖ్యమంత్రి అయితే చాలంటూ తన వినయాన్ని.. తన వీర విధేయతను.. ఆ పెద్దయాన ముందు ప్రదర్శించి..మార్కులు కొట్టేశారీ అంబటి రాంబాబు. అంతే ఆ ఎన్నికల్లో వైయస్ ఇలా సీఎం కావడం.. ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ పదవిని అలా అంబటికి కట్టబెట్టడం జరిగిపోయింది. అప్పటి నుంచి వైయస్ రాజశేఖర్ రెడ్డి అడుగులో అడుగు వేసి మరీ నడిచారు. ఆ తర్వాత వైయస్ఆర్ ఆకస్మిక మరణంతో.. వైయస్ జగన్ వెంట అంబటి నడిచారు. ఆ క్రమంలో వైయస్ జగన్.. కొత్త పార్టీ స్థాపించడంలో ఈయనదే కీలక పాత్ర. అంతేకాదు.. వైయస్ జగన్ 16 నెలలు జైలుకు వెళ్లినప్పుడు.. ప్రతి రోజు ఆ  పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టి మరీ.. నాటి ప్రతిపక్ష పార్టీని తన వాక్ చాతుర్యంతో చీల్చి చండాడే వారన్న సంగతి అందరికీ తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు వైయస్ ఫ్యామిలీకి.. ఎంత చేయాలో అంబటి రాంబాబు అంత చేశారనే ఓ చర్చ అయితే నాడు లోటస్ పాండ్ లోనే కాదు.. నేడు తాడేపల్లి ఫ్యాలెస్  వైరల్ అవుతోంది. అలాంటి నేతకు అమాత్య పదవి ఇచ్చి.. అందలం ఎక్కించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత భావిస్తున్నారట.

Related Posts