విజయవాడ(కానూరు) సిద్ధార్ధ ఇంజినీరింగ్ కళాశాలలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కమిటీల పర్యవేక్షణ బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. ఏపి టిడిపి అధ్యక్షుడు శ్రీ కళా వెంకట్రావు అధ్యక్షతన బుధవారం అమరావతిలో టిడిపి సమన్వయ కమిటి సమావేశం జరిగింది. ఇప్పటివరకు పూర్తి చేసిన మహానాడు ఏర్పాట్ల గురించి చర్చించారు. విజయవాడ,గుంటూరు నగరాలు, మహానాడు ప్రాంగణం అలంకరణ, ప్రతినిధుల నమోదు,రవాణా,పార్కింగ్,భోజన ఏర్పాట్లపై సమీక్షించారు.
మహానాడులో 3రోజులపాటు 31ముసాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టి చర్చిస్తారు.ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి తీర్మానాలు 5,ఏపికి సంబంధించినవి 18,తెలంగాణవి 8ఉంటాయి.తీర్మానాల ప్రతిని 22వ తేదీ కల్లా సిద్ధం చేయాలని కళా వెంకట్రావు సూచించారు.
కృష్ణా జిల్లా,గుంటూరు జిల్లా ఇన్ చార్జ్ మంత్రులు యనమల రామకృష్ణుడు,అయ్యన్న పాత్రుడు, జిల్లాల మంత్రులు,జిల్లా ఇన్ ఛార్జ్ ప్రధాన కార్యదర్శులు మహానాడుకు సంబంధించి అన్ని కమిటీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
అకాల వర్షాలు పడినా పార్కింగ్ కు ఇబ్బందులు లేకుండా 60ఎకరాల స్థలంలో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేయాలి.పార్కింగ్,ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్ల పర్యవేక్షణను మంత్రులు అచ్చెన్నాయుడు,చినరాజప్ప బాధ్యత తీసుకోవాలి.హైవే నుంచి వాహనం నగరంలోకి రాగానే ఏ జిల్లా వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలో నేరుగా అక్కడికే చేరుకునేలా చూడాలి.
ప్రతినిధుల వసతి,బస,ప్రాంగణం,నగరం పారిశుద్ధ్యం పర్యవేక్షణ బాధ్యతలను డా.పి.నారాయణకు అప్పగించారు. భోజన ఏర్పాట్లను జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు,కొల్లు రవీంద్ర చూస్తారు.మీడియా పాయింట్,ప్రెస్ మీట్ పాయింట్,మీడియా సిబ్బందికి కావాల్సిన ఏర్పాట్లను ఐ అండ్ పిఆర్ మంత్రి కాలువ శ్రీనివాసులు,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యవేక్షిస్తారు.
మహానాడు సందర్భంగా కృష్ణా జిల్లా,గుంటూరు జిల్లాల అలంకరణతోపాటుగా విజయవాడ,గుంటూరు నగరాలను సుందరంగా అలంకరించాలి. ప్రతినిధుల నమోదు కార్డుల ద్వారా జరుగుతుంది కాబట్టి, కార్డులు తీసుకురానివారు, పోగొట్టుకున్న వారికి వీలుగా కొత్తకార్డులు అందించే ఏర్పాట్లు ఉండాలి.ఎంపి కనకమేడల రవీంద్రకుమార్, ఏవి రమణ,బుచ్చిలింగం బృందం ప్రతినిధుల నమోదు బాధ్యత తీసుకుంటారు.
మూడురోజులు సాంస్కృతిక కార్యక్రమాలను ఎన్ శివప్రసాద్ నేతృత్వంలోని బృందం నిర్వహిస్తుంది. వాలంటీర్ల కమిటీని బీద రవిచంద్ర యాదవ్,కొత్తకోట దయాకర్ రెడ్డి,దీపక్ రెడ్డి,సత్యనారాయణ రాజు పర్యవేక్షిస్తారు.
సభా నిర్వహణ బాధ్యతలను పయ్యావుల కేశవ్, పెద్దిరెడ్డి,అరవింద్ కుమార్, అచ్చెన్నాయుడు,వర్ల రామయ్య,రామ్మోహన్ నాయుడు తీసుకుంటారు.మహానాడు 3రోజులు మినిట్ టు మినిట్ ప్రోగ్రాంను వీరు పర్యవేక్షిస్తారు.
మహానాడు వేదిక వద్ద 23వ తేదీన ఎన్టీఆర్ కటౌట్ ఏర్పాటు,24వ తేదీన చంద్రబాబు కటౌట్ ఏర్పాటు,25న వాలంటీర్ల మార్చ్ ఫాస్ట్, ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు పూర్తి,26న వేదిక నిర్మాణం పూర్తిచేసి అక్కడినుండే ప్రెస్ మీట్ పెట్టడం కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఈ వారం రోజులు పండుగగా మహానాడు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్న ధర్మపోరాట సభ ఏర్పాట్ల గురించి కూడా ఈ సందర్భంగా చర్చించారు.
లాంచీ ప్రమాదంలో మృతులకు సంతాపం
తూర్పుగోదావరి జిల్లా మంటూరు లాంచీ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ నేతలు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పార్టీ నేతలు 2నిముషాలు మౌనం పాటించారు. ప్రమాదంలో మృతులకు సంతాపం తెలిపారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సమావేశంలో మంత్రులు ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,కొల్లు రవీంద్ర,సిద్దా రాఘవరావు,కాలువ శ్రీనివాసులు,అఖిల ప్రియ,ఇతర మంత్రులు,పార్టీ ప్రధాన కార్యదర్శులు పయ్యావుల కేశవ్,వర్ల రామయ్య,జయ నాగేశ్వర్ రెడ్డి,సుబ్బారాయుడు,ఎమ్మెల్సీలు టిడి జనార్ధన్,వివివి చౌదరి, ఎల్ విఎస్ ఆర్ కె ప్రసాద్,అధికార ప్రతినిధులు,ఇతర నేతలు పాల్గొన్నారు.