YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

2023 లక్ష్యంగా చేతి గుర్తులు

2023 లక్ష్యంగా చేతి గుర్తులు

హైదరాబాద్ ఏప్రిల్ 6,
నూటముప్పై ఏళ్ల గ్రాండ్‌ ఓల్డ్ పార్టీలో మరోసారి పాత పాట వినిపిస్తోంది. ఐక్యమత్యమే మహా బలం అంటూ ఏకస్వరంతో పలుకుతున్నారు సీనియర్, జూనియర్ నేతలు. ఓడిపోయామని దిగులు చెందకు.. ఇక ముందు గెలిచేందుకు ప్రయత్నించు అంటూ మాలో లేని ధైర్యాన్ని రోట్లో నూరి నూరి మరీ మా నోట్లో పోసారండి.. ఇంకేముందండి.. మాకు వెయ్యేనుగుల బలం వచ్చినట్లైదండి.. అందరం కలిసిపోయామండి.. అంటూ ఢిల్లీ నుంచి మన తెలంగాణ సమాజానికి 38 కాంగ్రెస్‌ యోధులు మెస్సేజ్ పంపారు. ఇక నుంచి టీఆర్ఎస్‌ను ఎలా ఓడించాలో.. .బీజేపీని ఎలా బండకేసి బాదాలో అన్నది మాత్రమే ఆలోచిస్తారట. యువరాజు రాహుల్ గాంధ ఇచ్చిన బూస్టర్ డోసుతో తెలంగాణను జయించేందుకు సిద్ధమయ్యారట.తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది.వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమరానికి సన్నద్ధమవుతోంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. మంగళవారం సోనియా గాంధీతో సమావేశం ముగిసింది. అయితే, పార్టీ ఎంపీలపై సోనియా గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. పార్టీలో విభేదాలు పనికిరావని, అందరూ ఐకమత్యంతో కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాభవాలను చవిచూసిందని, దాంతో తాను షాక్‌కు గురైయ్యానని, ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.సోనియా గాంధీ మాట్లాడుతూ.. ”పార్టీని పటిష్ఠపరిచేందుకు నాకు చాలా మంది చాలా రకాలుగా సలహాలను ఇచ్చారు. అందులో చాలా విషయాలపై నేను ఎప్పటికప్పుడు దృష్టి పెడుతూనే ఉన్నాను. ఇటీవలి ఎన్నికల ఫలితాలు మిమ్మల్ని ఎంతలా అసంతృప్తికి గురుచేశాయో నేను అర్థం చేసుకోగలను. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనే మన సంకల్పం, చిత్తశుద్ధి, దృఢత్వానికి పరీక్ష ఎదురవుతుంది. కాబట్టి ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైంది పార్టీలో ఐకమత్యం. అందుకు నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను” అని సోనియా గాంధీ అన్నారు. మరోపక్క ఎన్నికల్లో పరాజయం తర్వాత సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేశామని, చాలా మంది చాలా సలహాలిచ్చారని గుర్తు చేశారు. త్వరలోనే చింతన్ శిబిర్ (ఆత్మ పరిశీలన) కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, ఇటీవలి సీడబ్ల్యూసీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నామని ఆమె వెల్లడించారు.బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతానని శపథం చేసిన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కాలంలో తరచూ కాంగ్రెస్ అనుకూల వ్యాఖ్యలు చేస్తుండటం, పలు సందర్భాల్లో రాహుల్ గాంధీకి బేషరతుగా మద్దతు పలికిన దరిమిలా రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు సంభావ్యతపై చర్చ ముమ్మరమైంది. కానీ కేసీఆర్ మాటల ట్రాప్ లో పడిపోరాదని, తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ తోగానీ, దాని మిత్రపక్షం ఎంఐఎంతోగానీ పొత్తు ఉండబోదని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలతో జరిగిన కీలక సమావేశంలో జాతీయ నేత రాహుల్ గాంధీ ఈ మేరకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీ విధానాలపైన పోరాటాలను ఉధృతం చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ దిశా నిర్దేశం చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెలాఖరులో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ టూర్ పై టీపీసీసీ ప్లాన్ డిజైన్ చేసింది. రెండు రోజుల పాటు పర్యటన ఉండేలా కసరత్తు చేస్తున్నారు. వరంగల్ లో సభ నిర్వహించేందుకు టీపీసీసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. సభ అనంతరం హైదరాబాద్ లో పార్టీ నేతలతో రాహుల్ గాంధీ సమావేశముండే అవకాశముంది. రాహుల్ టూర్ ప్లాన్ ను టీ పీసీసీ ఏఐసీసీకి పంపింది.ఇదిలావుంటే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన 38 మంది కీలక నేతలతో రాహుల్ గాంధీ ఢిల్లీలోని తన నివాసంలో సోమవారం సమావేశమయ్యారు. సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ మీటింగ్ సుదీర్ఘంగా నాలుగు గంటలపాటు సాగింది. సమావేశంలో చర్చించుకున్న వివరాలు ఆలస్యంగా వెల్లడయ్యాయి. తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తు ఉండబోదని కుండబద్దుకొట్టిన రాహుల్ గాంధీ.. తనకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, నేతలందరూ కలిసికట్టుగా పని చేసి టీఆర్‌ఎ్‌సను ఓడించడమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు.ఇదండీ సంగతి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో డీల్లీలో మూడుగంటల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల మీటింగ్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మాజీ మంత్రులతో పాటు మొత్తం 38మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్న రాహుల్‌.. నేతలకు దిశానిర్దేశం చేశారు. విభేదాలు పక్కనపెట్టి పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మనస్పర్ధలు, విభేదాలు ఉంటే పార్టీ వేదికపైనే చెప్పాలని.. ఎక్కడ పడితే అక్కడ ఇష్టారీతిన మాట్లాడొద్దని హితవుపలికారట. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరికలు కూడా చేశారట. సో..కాంగ్రెస్ మీటింగ్ సారాంశం…మూడు ముక్కల్లో చెప్పాలంటే… ఐకమత్యమే బలం.. కలిసుంటే కలదు అధికారం.. అంతర్గత గొడవలు వద్దు. .అధికారంలోకి రావడమే లక్ష్యం.. ఇదండి…మీటింగ్ తర్వాత కాంగ్రెస్ యోధులు చెప్పిన మాట.. పంజాబ్‌లో సిద్ధూభాయ్ ఏం చేశాడో తెలుసుగా…సొంత పార్టీ సీఎంపైనే ఆరోపణలు చేయడంతో…ఆ పార్టీ నిండా మునిగింది. అలాంటివి మరో చోట జరగకుండా సరిచేసేందుకు ముందు మన తెలంగాణ పీసీసీ బుర్రలను సాఫ్‌ చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ మరీ తీసికట్టు కాదు…పార్టీకోసం నిరంతరం శ్రమించే భట్టిలాంటి లీడర్లున్నారు. పార్టీకోసం ఎందాకైనా అని తెగించే మాంఛి కరుడుగట్టిన కేడర్‌ ఉంది. ఇప్పుడంటే అంతర్గత కుమ్ములాటలతో గాంధీభవనం ప్రతిష్ట మసకబారిందికానీ.. పాతరోజుల్లో కాంగ్రెస్‌ను ఢీకొనే ప్రత్యామ్నాయం.. కనిపించేదికాదు. ఇప్పుడలాంటి వైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులున్నాయని అధిష్టానం భావిస్తోంది. ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరిన షెఫాలజిస్ట్ సునీల్ సహాయంతో వ్యూహాలు సిద్ధం చేస్తోందట. నియోజకవర్గాల వారీగా బలాలు, బలహీనతలు, మరింత దృష్టి పెట్టాల్సిన అంశాలు వంటి వాటిపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి, డేటా సహాయంతో రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తోందట. 6 నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం, ప్రజల అవసరాలను గుర్తిస్తూ మేనిఫెస్టోను సైతం ముందుగానే రూపొందించడం , కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ చేయంచడం…ఇవన్నీ కాంగ్రెస్ వ్యూహాల్లోని భాగాలే. గత ఎన్నికల ప్రకారం ఓటింగ్ షేర్‌ చూస్తే…అధికార పార్టీ టీఆర్ఎస్ 46.9 ఓటింగ్ షేర్ వస్తే.. కాంగ్రెస్‌కు 28.4శాతంతో రెండో ప్లేస్‌లో ఉంది. బీజేపీ 7.1శాతంతో మూడో ప్లేస్‌లో ఉంది. సో…కాంగ్రెస్‌ కాస్త కష్టపడితే.. మెరుగైన ఫలితాలే వస్తాయనడంలో ఎలాంటి సందేహమే లేదన్నది ఆ పార్టీ నేతల మాట..కాంగ్రెస్‌ ఈ దుస్థికి కారణం…స్వయంకృతాపరాధమే. కాంగ్రెస్‌ను ఎవరో హత్య చేయాల్సిన అవసరంలేకుండా తనకు తానే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఒకప్పుడు పార్టీలో ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడగల సమఉజ్జీ నాయకులు కనీసం ఓ అరడజను మంది ఉండేవారు. వైఎస్‌ రాజశేఖర్‌ హయాం వరకు జనంలో నూ, పార్టీలోనూ మాంఛి గ్రేసున్న నేతలుండేవారు. కానీ ఇప్పుడలాంటి మాస్ లీడర్ భూతద్దం పెట్టి వెతికినా కనిపించడు… సీఎం కుర్చీ కోసం పోటీపడేవారు డజన్‌కి పైనే ఉంటారు.. కానీ కలిసికట్టుగా పోరాడరు. ఎప్పుడు చూసినా వారిమధ్య మనస్పర్ధలే. నేనంటే నేనని, పార్టీ ప్రయోజనాల్ని పణంగా పెట్టైనా ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం స్వపక్షంలోనే విపక్షంలాగా పోరాడుతుంటారు…మారుతున్న పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకొని కాలానికి ఎదురీదితే తప్ప కాంగ్రెస్‌‌కు ప్రస్తుతం మనుగడ కష్టం! పనితీరు మార్చుకోకుంటే, తెలంగాణ కాంగ్రెస్‌‌ పార్టీ పరిస్థితి కూడా యూపీకన్నా అధ్వాన్నంగా మారే ప్రమాదకరమైన స్థితిలో ఉంది.. అందుకే తెలంగాణ కాంగ్రెస్‌లోని 38మంది కీలక నేతలతో సమావేశం ఏర్పాటు చేసి.. నేతలకు దిశానిర్దేశం చేసింది. పంథా మార్చుకోకుంటే…తీవ్ర చర్యలుంటాయని హెచ్చరికలూ చేసింది..కాంగ్రెస్ నాయకులం అంతా కలిసి ప్రజల కోసం పోరాడాలని నిర్ణయించామని… అభిప్రాయ బేధాలపై రాహుల్ సమక్షంలో చర్చించామన్నారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇక పొత్తులపై కూడా మీటింగ్‌లో క్లారిటీ వచ్చిందట. టీఆర్ఎస్‌, ఎంఐఎంతో ఎలాంటి సంబంధాలుండవని ఖరాఖండిగా చెబుతోందా పార్టీ. ఇంటిని ఆర్డర్‌లో పెడుతూ…విమర్శలు నాలుగు గోడలకే పరిమితం కావాలని హైకమాండ్ గట్టిగా చెప్పినట్లు ఆ పార్టీ లీడర్ మధుయాష్కి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులుండవని స్పష్టం చేశారాయన మొత్తానికి గ్రాండ్ ఓల్డ్‌ పార్టీలో చాదస్తపు అలవాట్లు తగ్గించి…గ్రూప్ కొట్లాటలను మానుకుని…చేయి చేయి కలిపి చేయిగుర్తును బలంగా జనంలోకి తీసుకుపోవాలని హైకమాండ్ దిశానిర్దేశం. మరి చూడాలి…లోపాలను సరిచేసుకుని…నాటి వైభవం దిశగా అడుగులు వేస్తుందా..లేక అంతర్గత కుమ్ములాటలతో ఇంకా పాతాళంలోకి పార్టీ ఇమేజ్ పడిపోతుందా…అన్నది… తెలంగాణ కాంగ్రెస్ లో కొంత కాలంగా అలజడి రేపుతోన్న అంతర్గత విభేదాలను అడ్రస్ చేసిన రాహుల్ గాంధీ.. నేతలంతా కలిసికట్టుగా, ఐక్యమత్యంగా పనిచేయాలని ఆదేశించారు. పార్టీ అంతర్గత విభేదాలపై మీడియా ముందు మాట్లావద్దని, ఏ సమస్య ఉన్నా తనకు లేదా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చెప్పుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Related Posts