YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

షర్మిల బాణం ఎటు వైపో...

షర్మిల బాణం ఎటు వైపో...

హైదరాబాద్, ఏప్రిల్ 6,
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న వైయస్ షర్మిల.. రానున్న ఎన్నిల్లో విజయం సాధించి.. అధికారాన్ని హస్తం గతం చేసుకోంటుందా అంటే సందేహమేననే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఓ వైపు ముచ్చటగా మూడో సారి అధికారాన్ని అందుకోవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వ్యహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి  ఈటల గెలుపుతో సదరు సీఎం ఉక్కిరి బిక్కిరి అవుతూ.. కమలం పార్టీని తెలంగాణలో వికసింపకుండా చేయడం కోసం ఎంత చేయాలో అంత చేసేందుకు ఆయన సమాయత్తమవుతున్నారు. ఆ క్రమంలో గులాబీ బాస్.. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రా పదాన్ని ఎలా వాడుకున్నారో.. సేమ్ టూ సేమ్.. అలాగే రానున్న ఎన్నికల్లో బీజేపీ పదాన్ని వాడుకోనున్నారనే ఓ చర్చ అయితే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే హల్‌చల్ చేస్తోంది. మరోవైపు.. బీజేపీ కూడా తెలంగాణలో పాగ వేసి.. అధికారాన్ని అందుకోవడం కోసం స్కేచ్ వేసింది. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా... రాష్ట్రంలో వరుస పర్యటనలకు శ్రీకారం చుట్టారు... చుడుతున్నారు. ఇంకో వైపు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీని ప్రజల్లోకి కాంగ్రెస్ గుర్రంలా పరిగెట్టిస్తున్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సైతం తెలంగాణపై దృష్టి సారించి.. తెలంగాణ.. తెలంగాణ అంటూ ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. ఇన్నీ పార్టీల నడుమ.. ఇంత మంది కీలక నాయకుల నడుమ.. రాజన్న కుమార్తె, జగనన్న బాణం వైయస్ షర్మిల.. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తుందా? వాళ్ల మనస్సులు గెలుచుకోంటుందా? తెలంగాణ ప్రజలను తనవైపు తిప్పుకుని.. వారి ఓట్లతో అధికార పీఠాన్ని హస్తం గతం చేసుకోంటుందా? అంటే సందేహమే అనే సమాధానం ఆ పార్టీ నేతల నుంచే వస్తోంది. ఇప్పటికే.. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి అంతగా స్పందన రావడం లేదు. మరోవైపు మీడియా కూడా ఆమె పాదయాత్రను సైతం సరిగ్గా కవర్ చేయడం లేదు. ఇంకోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ టార్గెట్‌గా వైయస్ షర్మిల విమర్శలు గుప్పించడం పట్ల.. టీఆర్ఎస్ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. నేపథ్యంలో షర్మిల చేపట్టిన పాదయాత్రలో ఆమె ప్రసంగాలను అధికార పార్టీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. పోలీసుల జోక్యం తప్పని సరి అవుతోంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఎన్నికల వేళ .. ఇంకెలా ఉంటాయో అని లోటస్ పాండ్‌లో చర్చ సాగుతోంది. ఇవన్నీ దాటుకుని.. వైయస్ షర్మిల బాణం.. కేసీఆర్‌కు గుచ్చుకుంటుందా? ప్రజల గుండెల్లోకి చొచ్చుకెళుతుందా? అంటే డౌటే అంటున్నారు. ష‌ర్మిల తీరుతో జగ‌న‌న్న సైతం తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. త‌న‌ను కాద‌ని, త‌న స్నేహితుడైన కేసీఆర్‌పై సోద‌రి ఇలా రాజ‌కీయ పోరాటం జ‌ర‌ప‌డం అన్న‌య్య‌కు అసలేమాత్రం ఇష్టం లేద‌ని అంటున్నారు. ఇదే విష‌య‌మై ఇప్ప‌టికే ప‌లుమార్లు చెల్లిని జ‌గ‌న‌న్న వారించి, బెదిరించిన‌ట్టు స‌మాచారం. అయినా, ష‌ర్మిల త‌గ్గేదేలే అంటూ కేసీఆర్‌పై పాద‌యాత్ర‌గా దండ‌యాత్ర చేస్తుండ‌టం.. కేసీఆర్ ద‌గ్గ‌ర‌ జ‌గ‌న్‌కు బాగా ఇబ్బందిగా మారింద‌ని చెబుతున్నారు. గ‌తంలో తాను సంధించిన బాణ‌మే.. ఇప్పుడు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా త‌న‌కే గుచ్చుకోవ‌డంపై తెగ ఇదై పోతున్నార‌ట జ‌గ‌న్‌రెడ్డి. మ‌రి, ష‌ర్మిల ప్ర‌స్థానం ఎందాకో.. ఏ తీరాల‌కో..?

Related Posts