ఏసీ ఈసెట్ 2018 ఫలితాలను మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం నాడు విడుదల చేసారు. అయన మాట్లాడుతూ ఈసారి ఈసెట్ కు 33637 మంది పరీక్షలకు హాజరయ్యారు. 137 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. వారిలో 98 శాతం (33088)అర్హత సాధించారని అన్నారు. విద్యార్థినులు 98.74 శాతం, విద్యార్థులు 98.28 శాతం ఊత్తిర్ణత సాధించారు. విద్యార్థినులు 6816, విద్యార్థులు 26806 మంది హాజరయ్యారు. ఏ యూ పరిధిలో 98.38 శాతం, ఎస్వీయూ పరిధిలో 98.30 శాతం, ఓ యూ పరిధిలో 98.93 శాతం, స్థానికేతరులు 95.70 శాతం హజరయ్యారు. ఈ సెట్ ఫలితాలలో వివిధ విభాగాలలో టాపర్స్ గా బయోటెక్నాలిజిలో ఉమామహేశ్వర రావు (ఈస్ట్ గోదావరి), సిరామిక్ టెక్నాలజీ లో పిల్లి లోకేష్ (నెల్లూరు), సివిల్ లో సోమా రాకేష్ (వరంగల్) ఎలట్రానిక్స్ లో స్వాతి (మంచిర్యాల), ఫార్మశీలో విశాలి (కాకినాడ) నిలిచారు. .