విజయవాడ
విజయవాడ నగరపాలక సంస్థ నూతన మున్సిపల్ కమిషనర్ గా సప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ గా ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు. గతంలో తాను కాకినాడ టౌన్ కమిషనర్గా పనిచేశానని అక్కడి నుండి ఇక్కడికి బదిలీ చేయడం పై హర్షమ్ వ్యక్తపరిచారు. మరిముఖ్యంగా తనకు విజయవాడకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని గతంలో నూజివీడు సబ్ కలెక్టర్గా కూడా తాము విధులు నిర్వర్తించాలని తెలిపారు. మరీ ముఖ్యంగా విజయవాడ నగర వ్యాప్తంగా ఉన్న అక్రమ కట్టడాలపై స్పందిస్తూ గతంలో కాకినాడ పట్టణంలో ఏ విధంగా అయితే స్పెషల్ డిమాలిష్ టీమ్ ను ఏర్పాటు చేసి అక్రమకట్టడాల నియంత్రణ కోసం ఏ విధంగా అయితే పనిచేసామని అన్నారు. అదేవిధంగా విజయవాడ అటో నగర్ నగర వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా దిమాలిష్ టీమ్ ఏర్పాటు చేయడం లేక ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయడమా అనే విషయంపై సంబంధిత అధికారులతో చర్చించి చి రాబోయే కొన్ని రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత పెద్దదైన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ గా పని చేయడం తనకెంతో సంతోషంగా ఉందని తెలిపారు