YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

క్యాబినెట్ లో సోషల్ ఇంజనీరింగ్

క్యాబినెట్ లో  సోషల్ ఇంజనీరింగ్

విజయవాడ, ఏప్రిల్ 7
ఈసారి మంత్రివ‌ర్గ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ షాకులు, ట్విస్టుల‌తో ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. బొత్సా, పెద్దిరెడ్డి, బాలినేని, బుగ్గ‌న‌, పేర్ని, కొడాలి.. ఇలా చాలామంది సీనియ‌ర్స్‌కి షాకులు త‌ప్పేలా లేవు. ఆనం, ధర్మాన,  కాటసాని, రోజా, ర‌జిని లాంటి వారికి కేబినెట్ బెర్త్ క‌న్ఫామ్ అని అంటున్నారు. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. కులాలు, వ‌ర్గాల వారీగా మంత్రిమండ‌లిని వండి వారుస్తున్నార‌ట జ‌గ‌న్‌. కొంద‌రు మంత్రులు ఇప్ప‌టికే బ్లాక్‌మెయిల్ రాజ‌కీయాలు స్టార్ట్ చేసినా.. జ‌గ‌న్ ముందు వారి ప‌ప్పులేమీ ఉడ‌క‌ట్లేద‌ని అంటున్నారు. 11వ తేదీ సంచ‌ల‌నాల‌తో కూడిన కొత్త‌ కేబినెట్ ప్ర‌క‌టించ‌బోతున్నారు సీఎం జ‌గ‌న్‌. ఇక అంతా అనుకుంటున్న‌ట్టే.. న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా, చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీల్లో ఒక‌రికి మంత్రిప‌ద‌వి క‌న్ఫామ్ అని తెలుస్తోంది. కుదిరితే ఇద్ద‌రికీ ఇస్తార‌ని కూడా అంటున్నారు. రోజా మంత్రి ప‌ద‌వికి పెద్దిరెడ్డినే పెద్ద ప్రాబ్ల‌మ్‌గా మారార‌ని చెబుతున్నారు. ఇక‌, త‌మ్మినేని నుంచి సామినేని వ‌ర‌కూ.. జిల్లాల వారీగా ప‌లువురి పేర్లు ఫైన‌ల్ లిస్టుకు రెడీ అవుతున్నాయి. జిల్లాల వారీగా కేబినెట్‌ రేసులో ముందున్న‌ది వీరే..
శ్రీకాకుళం: ధర్మాన ప్రసాదరావు (పోలినాటి వెలమ), తమ్మినేని సీతారాం (కాళింగ), ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ (కాళింగ)
పార్వతీపురం మన్యం: విశ్వసరాయ కళావతి (ఎస్టీ), పీడిక రాజన్నదొర (ఎస్టీ)
అనకాపల్లి:  గుడివాడ అమరనాథ్‌ (కాపు), బూది ముత్యాలనాయుడు (వెలమ), గొల్ల బాబూరావు (ఎస్సీ) కరణం ధర్మశ్రీ (కాపు)
అల్లూరి సీతారామరాజు: ధనలక్ష్మి (ఎస్టీ), భాగ్యలక్ష్మి (ఎస్టీ), చెట్టి ఫాల్గుణ (ఎస్టీ)
విజయనగరం: కంబాల జోగులు (ఎస్సీ), బొత్స అప్పల నరసయ్య (తూర్పు కాపు)
కాకినాడ: దాడిశెట్టి రాజా (కాపు), పెండెం దొరబాబు (కాపు)
రాజమహేంద్రవరం: టి.వెంకటరావు (ఎస్సీ)
కోనసీమ: విశ్వరూప్‌ (ఎస్సీ), చెల్లుబోయిన వేణు (శెట్టి బలిజ), పొన్నాడ సతీశ్‌ (మత్ప్యకార)
ఏలూరు: బాలరాజు (ఎస్టీ), ఎలీజా (ఎస్సీ) అబ్బయ్యచౌదరి (కమ్మ), మేకా ప్రతాప వెంకట అప్పారావు (వెలమ)
పశ్చిమగోదావరి: ముదునూరు ప్రసాదరాజు (క్షత్రియ), గ్రంధి శ్రీనివాస్‌ (కాపు), కారుమూరి నాగేశ్వరరావు (యాదవ)
కృష్ణా: కొలుసు పార్థసారథి (యాదవ), జోగి రమేశ్‌ (గౌడ)
ఎన్‌టీఆర్‌: సామినేని ఉదయభాను (కాపు), రక్షణనిధి (ఎస్సీ), వసంత కృష్ణప్రసాద్‌ (కమ్మ)
గుంటూరు: ఆళ్ల రామకృష్ణారెడ్డి ( రెడ్డి)
బాపట్ల: మేరుగ నాగార్జున (ఎస్సీ), కోన రఘుపతి (బ్రాహ్మణ)
పల్నాడు: విడదల రజని (రజక), బ్రహ్మనాయుడు (కమ్మ)
ప్రకాశం: ఆదిమూలపు సురేశ్‌ (ఎస్సీ), అన్నే రాంబాబు (వైశ్య), మద్దిశెట్టి వేణుగోపాల్‌ (కాపు), టీజేఆర్‌ సుధాకరబాబు (ఎస్సీ)
తిరుపతి: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజా (రెడ్డి)
శ్రీ సత్యసాయి: అనంత వెంకట్రామిరెడ్డి (రెడ్డి), తిప్పేస్వామి (ఎస్సీ)
కర్నూలు: హఫీజ్‌ఖాన్‌ (ముస్లిం)
అన్నమయ్య గడికోట శ్రీకాంతరెడ్డి (రెడ్డి), నవాజ్‌పాషా (ముస్లిం)
నెల్లూరు: కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి)
నంద్యాల: కాటసాని రాంభూపాల్‌రెడ్డి (రెడ్డి)

Related Posts