చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం శెట్టిపల్లెలోని రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. శెట్టిపల్లిలో రైతులు భూములలో వ్యాపార కేంద్రాలు నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలను ఇటీవల హైదరాబాద్ లో పవన్ కి వివరించారు. గత నాలుగు రోజులుగా చిత్తురు పర్యటనలో ఉన్న పవన్ ఇవాళ శెట్టిపల్లికి వచ్చి రైతులతో మాట్లాడి మీకు నేను అండగా ఉంటానని , మీ భూములను ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని , మీ పట్టాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటున్నట్టు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి అన్నదాతల భూములను లాక్కోవడం సరికాదన్నారు. భూ సేకరణ చట్టం కొంత మంది నేతలకు చుట్టంగా మారిందని విమర్శించారు. టీడీపీ ప్రజలకు న్యాయం చేస్తారని 2014లో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదని, గ్రామాల్లో ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుపై మండిపడుతున్నారని అన్నారు. అభివృద్దికి రైతుల భూములే ప్రభుత్వానికి కనిపించాయా అంటూ ఘాటుగా విమర్శించారు..శెట్టిపల్లి భూములను తీసుకునే ప్రయత్నం ప్రభుత్వం మానుకోవాలి. రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.
శెట్టిపల్లి భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.