YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

విలవిలాడిపోతున్న కామన్ మ్యాన్

విలవిలాడిపోతున్న కామన్ మ్యాన్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7,
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెట్రోల్ మంటలు ఒక్కసారిగా ఆగి పోయాయి. సుమారు రెండు, రెడున్నర నెలల పాటు, పెట్రోల్, డిజిల్ ధరలు ఏ ఒక్క రోజూ ఒక్క పైసా అయినా పెరగలేదు. కానీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి, ఉత్తర ప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాతా, కేంద్ర ప్రభుత్వం, వడ్డన మొదలు పెట్టింది.మార్చి10న ఎన్నికల ఫలితాలు వస్తే, మర్చి 21 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు ఏ రోజుకు ఆ రోజు పైపై కి పరుగులు తీస్తూనే ఉన్నాయి. వడ్డన మొదలైన నాటి నుంచి గడచిన 16 రోజుల్లో, (మధ్యలో రెండురోజులు మినహా) పెట్రోల్, డీజిల్ ధరలు పెరగని రోజు లేదు.  అదేమంటే కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీల వైపు వేలెత్తి చూపుతుంది. కానీ, అలా ఒక వేలు చూపుతుంటే, నాలుగు వేళ్లు కేంద్రం వైపు, ప్రధాని మోడీ వైపు చూస్తున్నాయి.  నిజానికి ఇదేమీ అనూహ్య పరిణామం కాదు, ఎన్నికల తర్వాత వడ్డన తప్పదని, విపక్షాలు ముందునుంచే హెచ్చరిస్తూ వచ్చాయి. విపక్షాల విమర్శల విషయం ఎలా ఉన్నా, సామాన్య ప్రజలకు కూడా ఎన్నికల తర్వాత పెట్రోల్, డిజిల్ ధరలు పెరుగుతాయనే విషయం తెలియంది కాదు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ‘ఎన్నికల సమయంలో పెట్రోల్, డిజిల్ ధరలు పెరగవు. ఎన్నికల తర్వాత మాత్రమే పెరుగును’ అనేది దశాబ్దాలుగా సగటు భారతీయుడికి అనుభవంలో ఉన్న వాస్తవం.అయితే పెట్రోల్, డీజిల్ ధరలు ఇదే వేగంతో పరుగులు తీస్తే, ఇప్పటికే చుక్కలు చూపిస్తున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఇంకా పెరిగి, సామాన్య ప్రజలఫై ధరాఖాతం ప్రభావం భయంకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్రీలంక పరిస్థితులు రాక పోవచ్చును కానీ, పెద మధ్య తరగతి ప్రజలపై తీవ్రంగానే ఉంటుంది నిపుణులు అంటున్నారు.మన దేశంలో ఎప్పుడు డీజిల్ మరియు పెట్రోల్ రేట్లు అనేవి అంతర్జాతీయ మార్కెట్’లపై ఆధార పడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు పెరిగితే, దేశంలో రేట్లు కూడా ప్రభావితం అవుతూ ఉంటాయి.అదే సూత్రం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు కూడా ఆ ప్రభావం వినియోగదారులకు చేరాలి, కానీ, ఎప్పుడో కానీ , అలా జరగదు. అందుకు సర్కార్ సవాలక్ష కారణాలు చూపుతుంది. ఉదాహరణకు కరోనా మహమ్మారి కారణంగా  ప్రపంచ వ్యాప్తంగా చమురు డిమాండ్ తగ్గడం వల్ల గత సంవత్సరం (2021) ఏప్రిల్‌లో కుప్పకూలిపోయాయి.ఆ పరిస్థితి చాలా కాలం కొనసాగింది. అయినా, దేశంలో ఆ స్థాయిలో ధరలు దిగిరాలేదు. అయితే, వ్యాక్సిన్ వచ్చి మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత  ముడి  చమురు ధరలు మళ్ళీ భగ్గుమన్నాయి.ముడి చమురు బ్యారెల్ ధర  ఒక్కసారిగా  40 డాలర్ల నుండి 63.49 డాలర్లకు పెరిగిపోయింది. అదే అదనుగా దేశంలో పెట్రోల్,డిజిల్ ధరలకు రెక్క లొచ్చాయి. , ముడి చమురు ధరల కంటే, మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులలే ఎక్కువగ ఉన్నాయి. రిటైల్ పెట్రోల్ ధరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్ వాటానే  61 శాతానికి పైగా, డీజిల్ పంప్ రేట్లలో 56 శాతానికి పైగా ఉన్నాయి.ఈ భారం కొంత మేర తగ్గిస్తే, సామాన్యులపై ఇంత భారం పడే అవకాశం ఉండదు. కానీ, అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ, ఆ దిశగా పెద్దగా అడుగులు వేయవు. ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కొద్దిగా కరుణ చూపింది. అదే విధంగా చాలా వరకు రాష్ట్రాలు కూడా ప్రజల కష్టాన్ని కాసింత షేర్ చేఉకున్నాయి. కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాలు మాత్రం, పైసా తగ్గించ లేదు. అందుకే, దేశంలో పెట్రోల్ ధరల విషయంలో తెలుగు రాష్ట్రాలు ప్రధమ పంక్తిలో ఉన్నాయి. ఇప్పటికే దేశంలో చాలావరకు నగరాల్లో లీటరు పెట్రోల్ ధర  రూ.120 దాటింది. హైదరాబాద్‌లో కూడా రూ.120కి చేరువగా ఉంది. ఢిల్లీలో నిత్యం 80 పైసలు పెరిగితే.. హైదరబాద్‌లో మాత్రం 90 పైసలు పెరుగుతోంది.  హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 90 పైసలు పెరిగి.. రూ.119.49కి చేరింది. డీజిల్ రేటు మరోసారి 87 పైసలు పెరిగి... 105.49కి ఎగబాకింది. విశాఖపట్టణంలీలో లీటర్ పెట్రోల్  120 దాటేసింది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.120.81, డీజిల్ రేటు 106.40కి ఎగబాకింది. అమరావతి గుంటూరు ప్రాంతంలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 121కి చేరింది. డీజిల్ ధర రూ.106.65గా ఉంది. ఇప్పటికే సామాన్యులు ద్విచక్ర వాహనాలను వదిలి రెండు రెండు ‘కాళ్ల’ నడకకు మారుతున్నారు. మరోవంక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ చార్జీలు కూడా మోతెక్కి పోతున్నాయి. ఈ ప్రభావంతో ధరలు మంది పోతున్నాయి. ఏదీ కొనేలా లేదు ఏదీ తినేలా లేదు .. సామాన్యులకు  బండి బయటకు తీసే పరిస్థితి లేదు .. బస్సెక్కే పరిస్థితి లేదు ..ఇక మిగిలింది రెండు కాళ్ళ వాహనమే, అంటున్నారు జనం. ప్రభుత్వాలేమో.. ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్కుంటూ కాలక్షేపం చేస్తున్నాయి.

Related Posts