జైపూర్, ఏప్రిల్ 7,
ఒక వైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఇక నిమ్మకాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేసవి వచ్చిందంటే నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా పెరిగి కిలో రూ.400కి చేరాయి. ఎండ తీవ్రతల కారణంగా నిమ్మకాయలకు డిమాండ్ పెరగడం వల్ల ధరలలో ఈ పెరుగుదల కనిపిస్తుంది. దేశంలో కూడా ఒక ప్రాంతంలో కేజీ నిమ్మకాయలు కావాలంటే రూ.400 ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అది కూడా వేసవి కాలంలో సామాన్యులు ఎక్కువగా తాగేది నిమ్మనీళ్లే కావడంతో ఈ ధర వారిని బెంబేలెత్తిస్తోంది. మిర్చి కిలో రూ.200గా ఉంది. ఏప్రిల్ ప్రారంభంలో కిలో నిమ్మకాయ రూ.240కి, మిర్చి కిలో రూ.120కి లభించగా.. కొద్దిరోజుల్లోనే నిమ్మకాయ రూ.110, మిర్చి రూ.80 వరకు పెరిగింది. మీడియా కథనాల ప్రకారం.. మహారాష్ట్రలో కూడా నిమ్మకాయ ధరలు మండిపోతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో ఈ నిమ్మకాయలు కిలో రూ.350 నుంచి రూ.400కి చేరాయి.రాజస్థాన్‌లో కూడా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల 40 డిగ్రీలపైగా నమోదు అవుతున్నాయి. ధరల పెరుగుదలతో ఇప్పుడు నిమ్మనీళ్లు ధనవంతుల డ్రింక్ అయిపోయింది. జైపూర్ పరిసర ప్రాంతాల్లో కేజీ నిమ్మకాయల ధర రూ.400 వరకు పలుకుతోంది. గడిచిన 24 గంటల్లోనే నిమ్మకాయల ధర రూ.60 పెరిగిందంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే స్థానికంగా నిమ్మకాయల ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుందని, ఇలాంటి సమయంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో నిమ్మకాయల ధర ఆకాశన్నంటుతోందని స్థానిక వ్యాపారులు చెప్తున్నారు