YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రతికూల రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు..!!

ప్రతికూల రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు..!!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది . రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర ప్రదేశ్ కి మొదటి ముఖ్య మంత్రి ఆయనే...  2014 ఎన్నికల ముందు చంద్రబాబు వేరు ఎన్నికల తరువాత చంద్రబాబు వేరు. కొత్తగా పెట్టిన ఒక్క పార్టీ తో, కేంద్రం లో ఉన్నమరొక్క పార్టీ తో పొత్తు పెట్టుకుని సీఎం పీఠం దకించుకున్నారు. ప్రజలు కూడా  కొత్త రాష్ట్రాన్నిబాగుపర్చాలంటే ,  కొత్త రాజధాని నిర్మిచాలంటే  అనుభవం ఉన్న ముఖ్య మంత్రి కావాలని ఆయనని గెలిపించారు. 2014 ఎన్నికల ప్రచారం లో ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతూ,  ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐదు సంవత్సరాలు  మనకి ప్రత్యేక హోదా ఇస్తానంటే అలా కుదరదు మాకు పధి ఐదు సంవత్సరాలు కావాలి అని అన్నాను అంటూ  ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టి సీఎం పదవి లో కూర్చున్నారు.. సీఎం హోదాలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదా వస్తే మనకి ఏమి ప్రయోజనాలు ఉండవని, కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొస్తామని అన్నారు. చచ్చినోడి పెళ్లి కి వచ్చిందే కట్నం అన్నట్టు రాష్ట్ర ప్రజలు అందరూ ప్యాకేజ్ కోసం ఎదురు చూసారు. 4 సంవత్సరాలు పూర్తి అయింది.ఏ ప్యాకేజీలు ఆంధ్ర రాష్ట్రానికి ముట్టలేదు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయి అనగా, చంద్రబాబు కేంద్రానికి వ్యతిరేకంగా ప్రత్యేక హోదా కావాలంటూ ధర్మ పోరాట దీక్షలు, వాళ్ళ ఎమ్మెల్యే ల తో సైకిల్ యాత్ర లు చేయిస్తున్నారు. ఈ యాత్రలు, దీక్షలు ప్రత్యేక హోదా కోసమో లేకపోతే వచ్చే ఎన్నికలకు ప్రచారమో తెలియదు. తోటి తెలుగు రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక తెలంగాణ తెచ్చుకుంటే,  ఏపీ ముఖ్య మంత్రి మాత్రం  ప్రభుత్వం నుంచి  డబ్బులు తీసుకుని  ధర్మ దీక్షలు చేస్తున్నారు. 
ఇది ఇలా ఉండగా ఆంధ్ర రాష్ట్రము నుంచి పక్క రాష్ట్రాలకి వలస పోయిన తెలుగు వారిని కూడా వదలట్లేదు మన చంద్రన్న. అక్కడ ఉన్న తెలుగు వారిని ఆ పార్టీ కి ఓటు వేయకండి, ఈ పార్టీ కి ఓటు వేయండి అంటూ ఇక్కడ నుంచి చొక్కా లోపల పసుపు చొక్కా వేసుకున్న గవర్నమెంట్ ఆఫీసర్లను పంపి అక్కడ  ప్రచారం చేయించారు.   పాపం అక్కడ ఉన్న తెలుగు ప్రజలు పరిస్థితి అమ్మ పెట్ట పెట్టదు  ఆడుకు తిన్న నివదు అన్నట్లు ఉంది.  నిన్న జరిగిన కర్ణాటక ఎన్నికలలో ఇదే పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్న తెలుగు ప్రజలను బీజేపీ కి ఓటు వేయకండి అని కొంత మందితో ప్రచారం చేయించారు, కానీ బీజేపీకె  ఎక్కువ సీట్లు రావడం తో తొక్క ముడుచుకున్నారు చంద్రబాబు. ఇది ఇలా జరిగిన, ఎల్లో మీడియా ని అడ్డు పెట్టుకుని తెలుగు ప్రజలు  ఓటు వేయలేదు కనుకనే బీజేపీ కి 104 సీట్లు మాత్రమే వచ్చాయని జనాలని ప్రలోభ పెడుతున్నారు . కానీ సర్వే లో తేలినది ఏమిటి అంటే తెలుగు వారు ఉండే ప్రాంతాలలో బీజేపీ అనుకున్న వాటికన్నా ఎక్కువ సీట్లు సంపాదించింది. 

Related Posts