YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేంద్రానిది కక్ష సాధింపు చర్య

కేంద్రానిది కక్ష సాధింపు చర్య

మహబూబాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్   నాయకత్వంలో తెలంగాణ రైతు రాజు అయ్యి, రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించడం తట్టుకోలేని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కేసిఆర్  మీద కక్ష సాధింపు కోసం ఇక్కడి రైతుల ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ -  శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్ ఆరోపించారు.  కేంద్రం తన తప్పు తెలుసుకుని తెలంగాణ రైతన్న పండించిన యాసంగి పంటను అంతా కొనేవరకు ఈ ఉద్యమం ఆగదని హెచ్చరించారు.
తెలంగాణలో రైతు ధాన్యం కొనుగోలులో బీజేపీ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్ర టి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరసన దీక్షలో మంత్రి పాల్గొని, ప్రసంగించారు.
మంత్రి మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేఖ విధానాలపై నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు ఈ ఉద్యమం కొనసాగించాలని రైతు బిడ్డగా కోరుతున్నాను. బీజేపీ వ్యతిరేక దీక్ష మొదలైంది. ఓపిక ఉన్నంత వరకు, బీజేపీ కళ్ళు తెరిచే వరకు దీనిని కొనసాగిస్తాం. రాజకీయంగా మనం ఏ స్థాయి నాయకుల అయినా ముందుగా రైతు బిడ్డలం. వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నాం. రైతు సంతోషంగా ఉంటే, రెండు పంటలు పండిస్తే దేశమంతా అందరూ కడుపు నిండా అన్నం తింటారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురైంది. తెలంగాణ ఏర్పడితే ఇక్కడి రైతు సంతోషంగా ఉంటాడని, నీళ్ళు, నిధులు, నియామకాల నినాదంతో కెసీఆర్ గారు ఉద్యమం చేపట్టి రాష్ట్రం సాధించారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అనతి కాలంలోనే దేశానికి అన్నపూర్ణగా మార్చారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తున్నాము. తెలంగాణ రాక ముందు 30 లక్షల ఎకరాల్లో సాగు అయ్యే భూమి..తెలంగాణ వచ్చాక సీఎం కేసిఆర్ గారి నాయకత్వంలో నేడు కోటి 30 లక్షల ఎకరాల్లో సాగు అవుతుంది. తెలంగాణ ప్రాంతం చేసుకున్న అదృష్టం కేసిఆర్ గారు సీఎం కావడం. ఈ ప్రాంత అవసరాలు, సమస్యలు తెలిసిన వ్యక్తి సీఎం అయితే ఎలా ఉంటుంది అనేది నేడు మనం చూస్తున్నామని అన్నారు.
ఈ మహబూబాబాద్ ప్రాంతానికి నీళ్ళు కావాలని కొట్లాడాం..ధర్నాలు చేశాం..నిరసనలు చేశాం. కానీ సీఎం కేసిఆర్ గారు అపర భగీరథుడు వలె సాగు, తాగు నీరు ఈ ప్రాంతానికి తెచ్చారు. లక్ష కోట్ల రూపాయలు సాగు నీటిపై ఖర్చు పెట్టి కాళేశ్వరం వంటి అద్భుత ప్రాజెక్టు కట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చెరువులను ఎండా కాలంలో మత్తడి పోయిస్తున్నరు. తెలంగాణ వస్తె కరెంట్ ఉండదని అంటే 24 గంటల నాణ్యమైన కరెంట్ ను వ్యవసాయానికి ఉచితంగా అందిస్తున్నారు. రైతు బంధు ద్వారా రైతుకు పెట్టుబడి ఇస్తున్నారు. నేడు 63 లక్షల మంది ఖాతాల్లో రైతు బంధు నిధులు వేస్తున్నారు.  ఇప్పటికే 50 వేల కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో రైతు బంధు ద్వారా వేశారు. ఇది చూసి ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం  రైతును ఇబ్బంది పెట్టడం కోసం తెలంగాణలో యాసంగి పంటను కొనమని పార్లమెంటులో నిర్దాక్షిణ్యంగా, నిర్లజ్జగా మాట్లాడారు. రైతును అన్యాయం చేస్తూ అదానీ, అంబానిలకు దేశ సంపదను దోచి పెడుతున్నారు. యాసంగిలో వరి వేయొద్దని మనం ఊరూరు తిరిగి రైతులకు చెప్తుంటే..బీజేపీ నేతలు వరి వేయాలని నేను కొనిపిస్తా అని అన్న బండి అనే తొండి సంజయ్ ఇప్పుడు ఏం సమాధానం ఇస్తారో చెప్పాలన్నారు.   రైతు పండించిన ప్రతి గింజ కొనిపించే బాధ్యత నాది అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.  యాసంగిలో వరి ధాన్యం కేంద్రం కొనదు. కాబట్టి వరి వేయొద్దు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటలు రైతులు వినడం వల్ల 54 లక్షల నుంచి 34 లక్షల ఎకరాలకు వరి సాగు తగ్గింది అన్నారు.  పంజాబ్, హర్యానాలో కొన్నట్లే మన దగ్గర ధాన్యం కొనాలి అంటే నూకలు అవుతాయి...బియ్యం మాకు ఇచ్చి, నూకలు మీరు తినాలన్న కేంద్ర మంత్రి మూర్ఖపు పీయూష్ గోయల్  ను బర్తరఫ్ చేయాలి. రైతులకు ఆన్యాయం చేయకుండా బీజేపీ తన తప్పు తెలుసుకుని ఇక్కడి ధాన్యం మొత్తం కొనాలి. ఇప్పటికే గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి పంపాం. జిల్లా పరిషత్ తీర్మానాలు కూడా పంపాము. కేసిఆర్  నాయకత్వంలో రైతులు లబ్ది పొందుతున్నారు. గతంలో విత్తనాలు, ఎరువులకు క్యులో ఉన్నారు. నేడు ఆ పరిస్థితి లేదు. కేసిఆర్ గారికి రైతులను దూరం చేయాలని బీజేపీ పన్నాగం పన్నింది. దేశ వ్యాప్తంగా అన్నమో రామచంద్ర అనే కరువు ఉంది. హంగర్ ఇండెక్స్ లో ప్రపంచంలో 101 స్థానంలో ఇండియా ఉంది. రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సింది కేంద్రమే. అయితే అది కాదని రైతులను ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దీనిని నిరసిస్తూ ప్రతి రైతు ఎంటి పైన్నల్ల జెండా ఎగురేసి 11 వ తేదీ కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేస్తున్నాం. దీనికి మీరు అంతా మద్దతు తెలపాలి.  దేశంలో బీజేపీ మెడలు వంచే నాయకులు సీఎం కేసిఆర్ అని తెలిసి మన నాయకుణ్ణి బలహీన పర్చే కుట్ర బీజేపీ చేస్తుంది. బిడ్డా మాకు తెలుసు మీ మెడలు వంచి, రైతు పండించిన పంట కొనిపించే బాధ్యత తెరాస తీసుకుంటుంది. అప్పటి వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. దీనికి అందరు కలిసి రావాలని రెండు చేతులు జోడిస్తూ నమస్కరిస్తున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఎంపీ  మాలోతు కవిత, ఎమ్మెల్సీ   తక్కలపల్లి రవీందర్ రావు,  జెడ్పి చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, రైతు బంధు జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్, టిఆర్ఎస్ నాయకులు నూకల శ్రీ రంగారెడ్డి, బండి వెంకట్ రెడ్డి శ్రీకాంత్ నాయక్, మూల మధుకర్ రెడ్డి, పరకాల శ్రీనివాస్ రెడ్డి, కే ఎస్ ఎన్ రెడ్డి, దుర్గాప్రసాద్, యార్ల మురళీధర్ రెడ్డి, ఇతర స్థానిక జిల్లా నేతలు పాల్గొన్నారు.

Related Posts