ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు మండలం అన్నవరం రైస్ మిల్ యజమాని ని స్థానిక వైయస్సార్ సిపి కార్యకర్త సర్దార్ హుస్సేన్ బెదిరించినట్లు పోలీసు కేసు నమోదయింది. ఫోన్ చేసి రైస్ మిల్లు యజమాని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు పిర్యాదులో బాధితుడు పేర్కోన్నాడు. విజిలెన్స్ డిఎస్పి, ఏసీబీ డీఎస్పీ, మంత్రి కొడుకు నాకు స్నేహితులు వారందరికీ కూడా నేను మామూళ్ళు ఇవ్వాలి అంటూ బెదిరిస్తున్నట్లు సమాచారం. ఫోన్ చేసి యాభై వేలు రూపాయలు ఇవ్వాలని లేదంటే ఏం చేయాలో నాకు తెలుసు అని బెదిరిస్తున్నాడని బాధితుడు చక్రధర్ రావు అంటున్నాడు. కనీసం 20వేల రూపాయలు అన్నా ఇవ్వకపోతే నిన్ను వ్యాపారం చేయనివ్వనని నువ్వు చేసే వ్యాపారాలు నాకు తెలుసు అంటూ బెదిరిస్తున్నాడు. బంకులో ఆయిల్ కొడుతూ జీవనం సాగించే సర్దార్ హుస్సేన్ బ్లాక్మెయిల్ దిగడంతో వాయిస్ రికార్డ్ చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు.