YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

క్షణక్షణానికి మారిపోతున్న రాజకీయాలు

 క్షణక్షణానికి మారిపోతున్న రాజకీయాలు

కర్ణాటకలో రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ముఖ్యంగా వ్యూహానికి కాంగ్రెస్- జేడీఎస్‌లు విలవిలలాడుతున్నాయి. దీంతో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేస్తారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ తమ సభ్యులు చేజారిపోతారోనని , జేడీఎస్‌లు ఆందోళన చెందుతున్నాయి. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అన్ని పార్టీలు క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు అదృశ్యం కావడం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. బుధవారం బెంగళూరులో జరిగిన శాసనసభా పక్ష సమావేశానికి కొత్తగా ఎన్నికైన 78 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో 66 మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. దీంతో మిగతా 12 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు... వీరు హాజరుకాకపోవడం ఏంటనే పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలను బీజేపీ తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లు వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఇప్పటికే బీజేపీకి తన మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ సంఖ్యా బలం 105కు చేరుకుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆనంద్‌సింగ్‌, నాగేంద్ర, ఎంవై పాటిల్‌, రాజశేఖర్ పాటిల్‌లు బుధవారం ఉదయం నుంచి అందుబాటులో లేరని తెలుస్తోంది. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు గాలి సోదరులకు సన్నిహితులు కావడంతో బీజేపీ గూటికి వెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే జేడీఎస్‌‌కు చెందిన రాజ వెంకటప్ప నాయక, వెంకట రావ్‌ నాదగౌడ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కనిపించకుండా పోయారు. బెంగళూరులోని ఓ హోటల్‌లో జరిగిన జేడీఎస్‌ శాసనసభాపక్ష సమావేశానికి ఈ ఇద్దరు నేతలు హాజరుకాలేదు. తమ పార్టీకి చెందిన ఐదుగురు శాసనసభ్యులను ఇప్పటికే బీజేపీ నేతలు సంప్రదించారని జేడీఎస్‌ వెల్లడించింది. తనను కూడా సంప్రదించిందని మరో కాంగ్రెస్‌ నేత కూడా వెల్లడించారు. కర్ణాటకలో నిన్న వెలువడిన ఫలితాల్లో భాజపా 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మరో 8 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంది. కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది. మరో వైపు

 కర్ణాటక రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన బలంతో ఉన్న కాంగ్రెస్ - జేడీఎస్ కూటమికి గవర్నర్ వాజుభాయ్ అనుమతివ్వకపోవడంతో ఆ రెండు పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నట్లు తెలుస్తుంది. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఒక వేళ అనుమతివ్వకపోతే.. ఎమ్మెల్యేలంతా కలిసి గురువారం నుంచి రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ ధర్నాలో కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

Related Posts