YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మంత్రులంతా ఒకటే మాట...

మంత్రులంతా ఒకటే మాట...

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులపై చర్చ జరుగుతోన్న సమయంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా దిగిపోతున్నానని, తన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రి కాబోతున్నారని పేర్కొన్నారు.. గతంలో తమ్ముడు ప్రసాదరావు మంత్రిగా ఉన్నప్పుడు… నరసన్నపేట ఉపఎన్నికలో తనపై మరో సోదరుడు రామదాసును బరిలోకి దించాడని.. ఆ ధర్మ యుద్ధంలో తానే గెలిచానని కృష్ణదాస్ గుర్తుచేసుకున్నారు.. 2019 ఎన్నికల్లో తమ్ముడు ప్రసాదరావు కూడా వైసీపీ నుంచి పోటీ చేశారు.. ఎన్నికల్లో ఇద్దరం గెలిచామని చెప్పారు. సీఎం జగన్ తనను గుర్తించి డిప్యూటీ సీఎం చేశారని, మూడేళ్లు ఖాళీగా ఉన్న తమ్ముడు రేపో, మాపో మంత్రి అవుతాడంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.. ఇక, కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణపై  మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సముచిత నిర్ణయం తీసుకున్నారు.. ప్రజల్లోకి వెళ్లటానికి మాకు అవకాశం వస్తుందన్నారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్… మా తమ్ముడు ప్రసాద్ కూడా మంత్రి కావటానికి సమర్ధుడైన నాయకుడన్న ఆయన.. నా స్థానంలో తమ్ముడికి ఇవ్వడం మంచి నిర్ణయం అవుతుందన్నారు.. గతంలోనూ అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉందని తెలిపారు.. రెండున్నర సంవత్సరాల తర్వాత కొత్త వారికి అవకాశం ఇస్తానని అప్పుడే చెప్పారని గుర్తుచేసిన ధర్మాన.. ముఖ్యమంత్రి నాకు చాలా గౌరవం ఇచ్చారు.. ఏం బాధ్యత ఇచ్చినా పార్టీ కోసం మరింత ఉత్సాహంగా పని చేస్తానని వెల్లడించారు ధర్మాన కృష్ణదాస్.
సీఎం ఏం చెబితే అదే చేస్తాం
ధ్రప్రదేశ్‌ కేబినెట్‌లో ఉండేది ఎవరు..? ఊడేది ఎవరు..? కొత్తగా వచ్చేది ఎవరు..? ఎవరికి ఏ శాఖ..? అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. అయితే, మా తలరాతలు మార్చేది సీఎం జగనే అన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం.. కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణపై  మాట్లాడిన ఆయన… ఇన్నాళ్లూ మంత్రిగా చేయడం నా అదృష్టంగా తెలిపారు.. రాజీనామా చేయమని సీఎం జగన్ ఆదేశిస్తే.. ఆయన కాళ్ల ముందు తల వంచి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మళ్లీ మంత్రిగా అవకాశం కల్పిస్తారనే సంకేతాలు నాకేం లేవు.. అందరితో పాటు నేనూ రాజీనామాకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు.ఇక, సీఎం వైఎస్‌ జగన్ నాకు మరోసారి అవకాశం కల్పిస్తారో లేదో నాకు తెలియదు అన్నారు మంత్రి జయరాం… విమర్శలపై ఆయన స్పందిస్తూ.. ఇవాళ రేపట్లో బెంజ్ కారు అనేది గొప్ప విషయమేం కాదన్నారు.. కార్ల కొనుగోళ్లకు చాలా బ్యాంకులు రుణాలిస్తున్నాయని.. ఏం లేకున్నా.. ప్రతిపక్ష టీడీపీ నాపై అవాస్తవాలు గుప్పించిందంటూ మండిపడ్డారు.. నా శాఖలో గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి తీసి.. అచ్చెన్నాయుడు వ్యవహారాన్ని బయటపెట్టామని వెల్లడించారు మంత్రి గుమ్మనూరు జయరాం.
జగన్ నిర్ణయమే ఫైనల్
 ఈ సమావేశం తర్వాత ముగ్గురు, నలుగురు మినహా మిగతావారంతా రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది. కేబినెట్‌ భేటీలోనే దీనిపై క్లారిటీ రాబోతోంది. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… నేను మళ్లీ మంత్రి కావాలనే ఆశ లేదన్న ఆయన.. ఎల్లకాలం వైఎస్‌ జగన్ సీఎంగా ఉండాలనేదే నా కోరిక.. డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి జగన్ నన్ను ఎంతో గౌరవించారని.. జగన్ నా యజమాని.. నా నాయకుడు.. ఆయన నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు.. నాకు ఎంతో గౌరవం ఇచ్చిన వైఎస్ ఫ్యామిలీకి నేనెప్పుడూ రుణపడే ఉంటాను అన్నారు.ఇక, వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలు తప్పించినప్పుడు నేనేం బాధపడలేదు అన్నారు నారాయణస్వామి… దళితుడ్ని కాబట్టే వాణిజ్య శాఖ బాధ్యతల నుంచి నన్ను తప్పించారని కొందరు మూర్ఖులు కామెంట్లు చేశారని మండిపడ్డ ఆయన.. నన్ను డిప్యూటీ సీఎంను చేసినప్పుడు.. రాష్ట్రపతి ఛాంబర్లోకి తీసుకెళ్లినప్పుడు సీఎం జగన్ దళితుణ్ని గౌరవించారని ఎందుకు అనలేకపోయారు అని ప్రశ్నించారు. నా శాఖపై ప్రతిపక్షాలు అర్థం లేని విమర్శలు చేశాయని.. జంగారెడ్డి గూడెం ఘటన.. నాణ్యత లేని మద్యం సరఫరా అంటూ ప్రతిపక్షాలు విమర్శించినా ఒక్క మహిళైనా ఉద్యమించిందా..? అని నిలదీశారు. మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారంటూ ప్రతిపక్షం అర్ధరహిత ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టిన ఆయన.. ప్రభుత్వ ఆదాయాన్ని చంద్రబాబు ఏనాడైనా పేదలకు పంచారా..? వారి సంక్షేమానికి వినియోగించారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడేళ్లు సంత’ప్తి
మూడేళ్లలో సంతృప్తికరంగా పని చేశాను.. సీఎం, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఏ పని ఇచ్చినా సమర్థవంతంగా పనిచేస్తానని తెలిపారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌… ఇవాళే ఏపీలో పాత మంత్రులంతా రాజీనామా చేస్తారని తెలుస్తోన్న తరుణంలో.ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే 90 శాతం మంత్రులను మారుస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పారని.. ఆ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభం అయ్యిందన్నారు.. ముఖ్యమంత్రి అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్న ఆయన.. ఈ మూడేళ్లలో సంతృప్తికరంగా పని చేశాను.. సీఎం జగన్‌ ఇచ్చిన పనిని సమర్ధవంతంగా నిర్వర్తించటమే నా కర్తవ్యం అని.. అది పార్టీ బాధ్యతనా, ప్రభుత్వంలో కొనసాగింపు ఉంటుందా అన్నది ముఖ్యమంత్రి నిర్ణయమే అన్నారు.. ఇక, ప్రభుత్వం ఎటువంటి ఆరోపణలు చేయలేక రాజకీయ పార్టీలు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాయని మండిపడ్డ మంత్రి వెల్లంపల్లి.. వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగాం అన్నారు.
విద్యను ప్రజల్లోకి తీసుకెళ్లాం
ముగ్గురు, నలుగురు మినహాయిస్తే కేబినెట్‌ మంత్రులంతా రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది.. ఎవరు ఉంటారు.. ఎవరు కేబినెట్‌ నుంచి పార్టీ బాధ్యతల్లోకి వెళ్లినున్నారు అనేది ఆసక్తికరంగా మారింది..మంత్రి ఆదిమూలపు సురేష్‌.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కోసం నా తల కోసుకోవటానికి కూడా సిద్ధం అని ప్రకటించారు.. ముఖ్యమంత్రివి ఉన్నత ప్రమాణాలు.. ఆయన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయటానికి శాయశక్తులా పని చేశాను.. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి నాకు గొప్ప అవకాశం ఇచ్చారు.. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో పని చేయటం గొప్ప అనుభవంగా తెలిపారు ఆదిమూలపు సురేష్ పేదరికం విద్యకు అడ్డు కాకూడదనే విధానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ది అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్… గత పాలకులు విద్యను కార్పొటీకరణ చేయటానికి ప్రయత్నం చేశారన్న ఆయన.. విద్యారంగం సమూల మార్పులకు ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు చేపట్టారని ప్రశంసలు కురిపించారు.. ఈ మూడేళ్లలో విద్యా రంగంపై 76 సమీక్షలు సీఎం చేపట్టినట్టు వెల్లడించారు.. ఇక, తనకు ఏ బాధ్యత ఇచ్చినా మరింత ఉత్సాహంగా పని చేస్తానని వెల్లడించారు మంత్రి ఆదిమూలపు సురేష్.. కాగా, కాసేపట్లో ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది.. ఆ వెంటనే మంత్రుల రాజీనామాలు ఉండబోతున్నాయి.. ఇక, కొత్త మంత్రులు ఈ నెల 11వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.

Related Posts