YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అనంతపురంలో బెర్తుల ఎవరికి

అనంతపురంలో బెర్తుల ఎవరికి

అనంతపురం, ఏప్రిల్ 8,
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు దగ్గర పడే కొద్ది ఆశావహుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ క్రమంలో అనంతపురం జిల్లా నుంచి మంత్రి వర్గ పోటీలో పలువురు రాజకీయ అగ్ర నేతలు ఉన్నారు. వారి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. జిల్లాలో మంత్రి వర్గ రేసులో ప్రధానంగా ఏడుగురి పేర్లు వినిపిస్తున్నాయి. శంకరనారాయణను మంత్రి వర్గంలో ఉంచుతారా లేదా అన్నది ఒకటైతే.. ఉంచకపోతే కొత్తగా ఇద్దర్ని ఎవరు తీసుకుంటారనేది రెండో అంశం. శంకరనారాయణ రెండేళ్ల ట్రాక్ రికార్డ్ లో ఎలాంటి రిమార్క్స్ లేవు. కానీ శంకరనారాయణను తొలగిస్తే అదే సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది. దీంతో ఉషాశ్రీ చరణ్ కు మంత్రి పదవి ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆమెకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవడం ఆందోళన కలిగిస్తోంది. మహిళ కోటా, కురుబ సామాజిక వర్గం అనే బలాలు ఉన్నా సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది.ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి దాదాపు మంత్రి పదవి ఖాయమనే టాక్ వినిపిస్తోంది. సీఎం జగన్ కు పద్మావతి భర్త సాంబశివారెడ్డి సన్నిహితుడు. కాబట్టి ఎస్సీ కోటాలో మంత్రి పదవి వస్తే పద్మావతికే అన్నది ప్రచారంలో ఉంది. కాకపోతే ఇక్కడ ఎమ్మెల్యే పై పెద్దగా కంప్లైంట్స్ లేకపోయినా చుట్టూ ఉన్న వారిపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన సీఎం జగన్ కు సన్నిహితుడు. కష్టకాలంలో ఆయన వెంట ఉన్నారు. వివాదరహితుడు కావున ఆయనకు గ్యారెంటీగా మంత్రి పదవి అన్న టాక్ ఉంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా ఉన్నారు. గాలి జనార్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు.ఇక రెడ్డి సమాజిక వర్గం విషయానికొస్తే ఇందులో సీనియర్ నేత అయిన అనంత వెంకట్రామిరెడ్డి పేరు ప్రముఖంగా ఉంది. ఆయన నాలుగు సార్లు ఎంపీ, ఒక సారి ఎమ్మెల్యే.. వివాద రహితుడు. జగన్ కు సన్నిహితుల్లో ఆయన కూడా ఒకరు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. ఆయన ఇప్పటికే ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు. రెండు రాష్ట్రాల్లో తరచూ ఆయన పేరు వినిపిస్తుంటుంది. డిఫరెంట్ వర్క్ స్టైల్ తో అందిరి దృష్టిలో ఆయన ఎప్పుడూ ఉంటారు. దీనికి తోడు వైఎస్ కుటుంబంతో నాలుగు దశాబ్ధాలుగా అనుబంధం ఉంది.ఇక రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి.. రాష్ట్రంలో బలమైన గుర్తింపు ఉన్న పరిటాల కుటుంబంపై మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2019లో రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచారు. ఈయన పేరు మంత్రి వర్గ రేస్ లో బలంగా ఉన్నా.. ఆయన సోదరులు చేస్తున్న పనులపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇక చివరగా ఎమ్మెల్సీలకు ఇవాల్సి వస్తే ఇక్బాల్ పేరు ముందుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ గా పేరుంది. సీఎం జగన్ మొదటి నుంచి చాలా ప్రియార్టీ ఇస్తున్నారు. మైనార్టీ కోటాలో అంజాద్ బాషా స్థానంలో డిప్యూటీ సీఎం ఇస్తారనే టాక్ ఉంది.

Related Posts