YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నీరవ్ కు బిగిస్తున్న ఉచ్చు

 నీరవ్ కు బిగిస్తున్న ఉచ్చు

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేల కోట్లు ఎగ్గొట్టిన నీరవ్ మోదీ కేసులో సీబీఐ పోలీసులు రెండవ చార్జ్‌షీట్‌ను నమోదు చేశారు. మోహుల్ ఛోస్కీ సుమారు 7వేల కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు సీబీఐ తన లేఖలో పేర్కొన్నది. రూ.512 కోట్లకు సంబంధించిన ఆరు లేఖలను కూడా సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పొందుపరించింది. ఐపీసీలోని సెక్షన్ 409, 420 కింద చార్జ్‌షీట్‌ను తయారు చేశారు. సీబీఐ తన చార్జ్‌షీట్‌లో ఛోస్కీని మోస్ట్ వాంటెడ్‌గా పేర్కొన్నది. 50 సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత సీబీఐ ఈ నిర్ధారణకు వచ్చింది. 12 లావాదేవీలు కూడా ఛోస్కీ చేసినట్లు తన నివేదికలో పేర్కొన్నది. గీతాంజలి జెమ్స్ లిమిటెడ్, గిల్లీ ఇండియా లిమిటెడ్, నక్షత్రా బ్రాండ్ లిమిటెడ్ సంస్థలపైన కూడా ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.

Related Posts