YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దిగజారుతున్న నేతల వ్యాఖ్యలు....

దిగజారుతున్న నేతల  వ్యాఖ్యలు....

గుంటూరు, ఏప్రిల్ 8,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ గొప్పగా మాట్లాడింది లేదు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ నాయకుల గురించి ఆయన ఏనాడూ సంస్కారవంతమైన భాషను ఉపయోగించలేదు. చివరకు మంత్రులు సభలో, వినడానికి, రాయడానికి కూడా వీలులేని బూతులు మాట్లాడిన. మహిళలను అవమానపరిచే విధంగా ప్రత్యర్ధులను వితంతువు, అనే అర్థం వచ్చే అసభ్యపద ప్రయోగం చేసినా, పగలబడి నవ్వారే కానీ, నిలువరించలేదు. అయితే, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ను గురించి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన ‘దయ్యం’ వ్యాఖ్యలు ఆయన హోదాకున్న స్థాయిని దిగజార్చే విధంగా ఉందని అంటున్నారు. అదే విధంగా, చంద్రాబాబు, పవన్ కళ్యాణ్’ను ఉద్దేశించి, ‘ఆ ఇద్దరూ మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలని’ చేసిన  వ్యాఖ్యలు ఆ ఇద్దరూ కలిస్తే ఏమవుతుందో అనే భయం ఆయన్ని వెంటాడుతోందనే విషయాన్ని స్పష్టం చేసిందని, ఆ ఫ్రస్ట్రేషన్’లోనే జగన్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య  ప్రజల్లో కూడా ఇదే విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. నర్సరావుపేటలో వాలంటీర్లకు సన్మానం పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి, అదుపు తప్పి విపక్షాలపై విరుచుకు పడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓ దొంగల ముఠా అన్నారు. హైదరాబాద్‌లో మకాం వేసి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. తాను మారీచులు.. రాక్షసులతో యుద్ధం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే ఆయన అంతోటి ఆగ్రహానికి, కారణం లేక పోలేదు. అది కూడా ఆయనే చెప్పుకొచ్చారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి వచ్చిన తర్వాత, కొన్ని మీడియా సంస్థలు, తమకున్న సమాచారం ఆధారంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధాని ముఖ్యమంత్రికి క్లాస్ తీసుకున్నారని పేర్కొంటూ కథనాలు ప్రచురించాయి. ఇది ఆయన్ని ఆగ్రహానికి గురిచేసింది. మూడో మనిషి లేకుండా, తానూ, ప్రధాని ముఖాముఖీ జరిపిన చర్చల గురించి బయటి వారికీ తెలిసే అవకాశం లేదని, అందుకే ఆ మీడియా సంస్థలు చెప్పే వాటిని నమ్మనే నమ్మవద్దని ప్రజల్ని కోరారు. అయితే, ప్రధానితో ముఖాముఖీ జరిపిన చర్చల్లో ఏమి చర్చించారో, మాత్రం జగన్ రెడ్డి చెప్పలేదు. ఇలా, గుమ్మడి కాయ దొంగ ఎవరంటే బుజాలు తడుముకున్నట్లు ముఖ్యమంత్రి, పీఎం క్లాసు తీసుకున్న విషయాన్ని దాచేయడంతో అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. నిజానికి, ఇలా ఇద్దరు ముఖ్య నేతలు కలిసి నప్పుడు  ముఖ్యమంత్రి సొంత పత్రిక సాక్షి సహా అన్ని పత్రికలూ తమకున్న సమాచారం అదారంగా కథనాలు ప్రచురించడం కొత్త కాదు. నిజానికి ముఖ్యమంత్రికి ప్రధాని క్లాసు తీసుకున్నారు అనేది పూర్తిగా నిరాధారమైన వార్త కాదు. అంతకు కొద్దిరోజుల ముందే, శ్రీలంక పరిణామాల నేపధ్యంగా, ప్రధాని రాష్ట్రాల ఆర్థిక, స్థితి గతులు, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నవరత్నాల వంటి జనాకర్షక పథకాలు ఇత్యాది విషయాలపై సుదీర్ఘంగా, ఉన్నతాదికారులతో    చర్చించారు. ఈ సందర్భంగా, అప్పుల్లో రెండవ స్థానంలో ఉన్న ఏపీ సహ మరికొన్ని రాష్ట్రాల్లో శ్రీలంక సంక్షోభాన్ని మించిన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని, అధికారులు చేసిన వ్యాఖ్యలు, అందుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను, తెలుగు పత్రికలే కాదు, దేశ విదేశీ పత్రికలు కూడా ప్రముఖంగా ప్రచురించాయి. ఈ నేపధ్యంలో  ముఖ్యమంత్రి హఠాత్తుగా ఢిల్లీ వెళ్లి ప్రధానితో ముఖాముఖి చర్చలు జరిపినప్పుడు, ఇలాంటి కథనాలు రావడం సహజం. అందులో విశేషం లేదు. ఆగ్రహం చెందవలసిన అవసరం లేదు. అయితే, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా , కుటుంబ పరంగా అన్ని విధాల పరిస్థితులు అదుపు తప్పుతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఫ్రస్ట్రేషన్’ లోకి జారు కుంటున్నారని, అందుకే  ఇలాంటి అవాకులు, చవాకులు, దూషణ, భూషణలకు దిగుతున్నారని, ఆయన సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సంచారాన్ని బట్టి తెలుస్తోందని అంటున్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క ఏపీ విషయంలోనే కాదు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్ని రాష్ట్రాలను అదుపుచేసేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తోంది.ఇదేమి రహస్యమేమీ కాదు. మరో వంక అప్పులు లేకుండా రాష్ట్రంలో అమలులో ఉన్న ఓటుబ్యాంకు ఉచిత్ పథకాలు  అమలు చేయడం అయ్యే పని కాదు. రాష్ట్ర సొంత ఆర్ధిక వనరులు రోజు రోజుకు అడుగంటి పోతున్నవిషయం కూడా అందిరికీ తెలిసిందే. మరోవంక, తెలుగు దేశం, జనసేన కలిసి పోటీచేస్తే వైసీపీ నూకలు చెల్లినట్లేనని సర్వేలు సంకేత మిస్తున్నాయి, అందుకే ఆ ఫ్రస్ట్రేషన్’ తట్టుకోలేక ముఖ్యమంత్రి అసహనానికి గురవుతున్నారని, అంటున్నారు.

Related Posts