ఖమ్మం
అటవీశాఖలోని అధికారులు అందిన కాడికి దండుకుంటున్నారు..ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా అనుమతి కావాలంటే లక్షలు ముట్ట చెప్పాల్సిందే..తాజాగా అటవీశాఖలో ఎఫ్ఎస్వో పనిచేసే కవిత అధికారిణి అవినీతి ఆరోపణలతో సస్పెండ్ కావడమే ఇందుకు ఉదాహరణ..ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, ముదిగొండ మండలాలల్లో అటవీశాఖలో ఎఫ్.ఎస్.ఓ గా పనిచేస్తున్న కవిత అనే అధికారిణి ని ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు..
కోదాడ టూ ఖమ్మం మధ్యలో నేషనల్ హైవే రహదారి నిర్మాణంలో భాగంగా చెట్లను నరికెందుకు ప్రమీల అనే కాంట్రాక్టర్ వద్ద నుంచి లక్షల్లో లంచం తీసుకోవడమే కాక, నరికిన చెట్లను తరలించే సమయంలో సైతం డబ్బులు ఇవ్వాలని నేలకొండపల్లి ఫారెస్ట్ అధికారి కవిత ఇబ్బంది పెట్టడంతో మహిళా కాంట్రాక్టర్ ప్రమీల అటవీశాఖ ఉన్నత అధికారులకు పిర్యాదు చేసింది..పిర్యాదు పై విచారణ చేపట్టిన వారు నిజమే అని తేలడంతో ఎఫ్.ఎస్.ఓ కవితను సస్పెండ్ చేశారు..ఇదే విషయంలో మరికొందరు అటవీశాఖ అధికారులపై వేటు పడనునట్లు విశ్వసనీయ సమాచారం..కాంట్రక్టర్ ప్రమీల అటవీశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో రాజీకోసం ప్రమీల ఇంటికి ఎఫ్.ఎస్.ఓ కవితతో పాటు మరో ఇద్దరు అటవీశాఖ అధికారులు వెళ్లడంతో ఆవిడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..