YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జోగులాంబ నుంచి బండి పాదయాత్ర

జోగులాంబ నుంచి బండి పాదయాత్ర

హైదరాబాద్, ఏప్రిల్ 8,
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 31 రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 14వ తేదీన జోగులాంబ జిల్లా నుంచి ప్రారంభమయ్యే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన 391 కిలోమీటర్ల మేర పర్యటన చేపట్టనున్నారు. మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు, 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో 97 గ్రామ పంచాయతీల్లో పాదయాత్ర చేపట్టి తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నారు. తొలిరోజు జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ దేవాలయంలో పూజలు నిర్వహించి ఆ రోజు అక్కడే బస చేయనున్నారు. ఏప్రిల్ 15వ తేదీన జోగులాంబ దేవాలయం నుంచి యాత్రను ప్రారంభించే సంజయ్ గద్వాల సమీపంలోని నిర్వహించే బహిరంగసభ వేదిక వరకు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభకు జాతీయ స్థాయి నేత హాజరు కానున్నారు. రాత్రి బహిరంగసభ వేదిక సమీపంలోనే బస చేసే సంజయ్ 16వ తేదీ నుంచి యాత్రకు విరామం ఇవ్వకుండా కొనసాగించాలని నిర్ణయించారు. రెండో విడత పాదయాత్ర మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోకసభ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు చేవెళ్ల నియోజకవర్గంలోని మహేశ్వరం నియోజకవర్గంలో ముగించనున్నారు. గద్వాల, మక్తల్, నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చర్ల, వనపర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, మైసిగండి, మహేశ్వరం వరకు కొనసాగనుంది. రెండవ విడత పాదయాత్రలో ప్రారంభం, ముగింపు సందర్భంగా కేవలం రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని బీజేపీ శ్రేణులు నిర్ణయించారు. మరో ఎనిమిది చోట్ల మధ్య స్థాయి సభలు నిర్వహించాలని ఖరారు చేశారు. బండి సంజయ్ పాదయాత్ర రోజుకు 13 నుంచి 14 కిలోమీటర్లు మాత్రమే సాగించేలా శ్రేణులు రూట్ మ్యాప్ సిద్ధం చేశాయి. ఇదిలా ఉండగా పాదయాత్ర ముగింపు సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రానున్నారు.

Related Posts