YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వమే మూల్యం చెల్లించాలి : పవన్

ప్రభుత్వమే మూల్యం చెల్లించాలి : పవన్

గోదావరిలో లాంచీ ప్రమాద ఘటనలో ప్రభుత్వం నిర్ణక్ష్య వైఖరిపై అధినేత ఫైర్ అయ్యారు. ప్రమాద ఘటన తెలియగానే జనసేన కార్యకర్తల్ని సహాయక చర్యల్లో పాల్గొనవల్సిందిగా పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్.. ట్విట్టర్ ద్వారా బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ‘ గోదావరి నదిలో లాంచీ ప్రమాద ఘటన తెలియగానే గుండె బరువెక్కింది. రోజు వారీ అవసరాలకి ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్న గిరిజనులు జల సమాధి కావడం ఆందోళన కలిగించింది. 60 అడుగుల లోతున లాంచీ పడిపోయిందని తెలిశాక ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధమైంది. మరణించిన వారి కుటుంబాలకు నా తరపున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో సర్కార్ శాఖలు, ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదానికి గురైన లాంచీకి అనుమతులు సక్రమంగా లేవంటే.. లోపం ఎవరిది? జవాబుదారీతనం లేని పాలన విధానాలే అమాయకుల్ని జల సమాధి చేశాయి. దుర్ఘటన జరగగానే హడావిడి చేసే పాలకులు.. సమస్యలకి శాశ్వత పరిష్కారాలను చూపించాలి. ప్రజల వద్దకు పాలన ప్రకటనలకే పరిమితమా? నిత్యావసరాలకి, వైద్యం, విద్య, ఏ పని ఉన్నా నదిలోనే ప్రయాణాలు సాగిస్తూ గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ శాఖలు గిరిజన గూడేలపూ శ్రద్ధ చూపడం లేదు. పోలవరం నిర్వాసితులు అధికారుల చుట్టూ తిరిగి వెళుతూ ఈ ప్రమాదంలో చనిపోవడం దురదృష్టకరం. బాధిత కుటుంబాలకు తగిన పరిహారం ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి గిరిజనులకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనతో పాటు పాలన వారి గూడేలకి చేర్చాలి. నదుల్లో అనుమతులు లేని బోట్లను తిరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. కృష్ణానదిలో బోటు ప్రమాదం ఘటన మరువత ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరం. అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. కాగా ఈ ప్రమాదంలో జరిగే సమయంలో లాంచీలో మొత్తం 50 మంది ఉండగా.. 16 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన 34 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులు, సహాయ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టారు. దేవీపట్నం మండలం మంటూరు దగ్గర 60 అడుగుల లోతులో లాంచీ ఉన్నట్టు ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు కనుగొన్నాయి. గల్లంతైనవారి మృత‌దేహాలన్నీ లాంచీలోనే ఉన్నట్టు గుర్తించిన అధికారులు, వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

Related Posts